“మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా. మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.. . . . మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు”. (హెబ్రీయులు 8:1–2, 5)
మనము ఇంతకు ముందు చూశాము. కానీ ఇంకా ఉంది. క్రిస్మస్ అంటే ఛాయలను నిజమైన వాటితో భర్తీ చేయడం.
హెబ్రీ 8:1–2, 5 ఒక సారాంశం. విషయమేమిటంటే, మనకు మరియు దేవునికి మధ్యవర్తిగా ఉండి మనలను దేవునితో సరిచేసి, మన కోసం దేవునికి ప్రార్థించే ఈ యాజకుడు పాత నిబంధన రోజుల వలె సాధారణ, బలహీనమైన, పాపాత్మకమైన, మరణించే యాజకుడు కాదు. ఆయన బలమైన, పాపరహితమైన, నాశనంలేని దేవుని కుమారుడు.
అంతే కాదు, అరిగిపోయే, చిమ్మట-తినే, తడిసిపోయే, కాలిపోయే, నలిగిపోయే, దొంగిలించబడే మరియు స్థలం మరియు పరిమాణ పరిమితులు గల భూసంబంధమైన2 గుడారంలో ఆయన పరిచర్య చేయడం లేదు. హెబ్రీయులు 8:2, క్రీస్తు “మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారములో” మన కోసం పరిచర్య చేస్తున్నాడని చెబుతోంది. ఇది ఛాయ కాదు. ఇది పరలోకంలో నిజమైన విషయం. మోషే కాపీ చేయడానికి సీనాయి పర్వతం మీద నీడని వేసిన వాస్తవికత ఇది.
హెబ్రీయులు 8:1 ప్రకారం, ఛాయ కంటే గొప్ప వాస్తవికత గురించి మరొక గొప్ప విషయం ఏమిటంటే, మన ప్రధాన యాజకుడు పరలోకంలో మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. పాత నిబంధన యాజకుడు ఎవరూ అలా చెప్పలేరు.
యేసు తండ్రి అయిన దేవునితో నేరుగా వ్యవహరిస్తాడు. దేవునితో ఆయనకి గౌరవ స్థానం ఉంది. ఆయన దేవునిచే అనంతంగా ప్రేమించబడ్డాడు మరియు గౌరవించబడ్డాడు. ఆయన నిరంతరం దేవునితో ఉంటాడు. ఇది కర్టెన్లు, గిన్నెలు, బల్లలు, కొవ్వొత్తులు, వస్త్రాలు, కుచ్చులు, గొర్రెలు, మేకలు, పావురాల వంటి నీడ-వాస్తవికం కాదు. ఇది చివరి, అంతిమ వాస్తవికత: దేవుడు మరియు ఆయన కుమారుడు మన శాశ్వతమైన రక్షణ కోసం ప్రేమ మరియు పవిత్రతతో పరస్పరం వ్యవహరిస్తారు.
అంతిమ వాస్తవికత ఏమిటంటే, దైవత్వంలో సంబందాలు కలిగి ఉన్న వ్యక్తులు వారి మహిమ, పవిత్రత, ప్రేమ, న్యాయం, మంచితనం, సత్యం విమోచించబడిన ప్రజలలో ఎలా ప్రదర్శించాలో ఒకరికొకరు వ్యవహరిస్తారు.