“మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా. మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను”. (హెబ్రీయులు 8:1-2)
హెబ్రీ గ్రంధం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భూసంబంధమైన యాజక పరిచర్య వ్యవస్థకు సరిపోయే ఒక ఉత్తమమైన మరియు చివరి మానవ యాజకుడుగా మాత్రమే ఉండాలని రాలేదు కానీ ఆయన ఆ వ్యవస్థను నెరవేర్చడానికి, అంతం చేయడానికి మరియు మొదట కల్వరిలో మన ఆఖరి బలిగా ఆపై పరలోకంలో మన చివరి యాజకునిగా పరిచర్య చేస్తున్న క్రీస్తుపై మన దృష్టి అంతా మళ్లించడం కొరకు వచ్చాడు.
పాత నిబంధన గుడారం, యాజకులు మరియు అర్పణలు రాబోవు వాటి ఛాయలు. ఇప్పుడు నిజమైనవి వచ్చాయి కాబట్టి నీడలు అంతమయిపోయాయి.
పిల్లల కోసం మరియు ఒకప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవారు మరియు అప్పటి విషయాలు గుర్తుంచుకున్న వారికొరకు క్రిస్మస్ సాదృశ్యం ఇక్కడ ఉంది. మీరు మరియు మీ అమ్మ ఒక దుకాణంలో విడిపోయారని అనుకుందాం. అప్పుడు మీరు భయపడి ఆందోళనకు గురవుతారు. ఏ మార్గంలో వెళ్లాలో తెలియక, మీరు చివరి వరకు పరిగెత్తారు, మరియు మీరు ఏడవడానికి ముందు, మీరు మీ అమ్మ నీడను ఆ చివర చూసినప్పుడు, అది మీకు నిరీక్షణను ఇస్తుంది. అయితే ఏది గొప్పది? నీడను చూడడం వలన వచ్చిన నిరీక్షణనా? లేదా నిజంగా మీ అమ్మ ఆ వైపు నుండి అడుగు పెట్టడమా?యేసు మన ప్రధాన యాజకునిగా వచ్చినప్పుడు అదే విధంగా ఉంటుంది. క్రిస్మస్ అంటే అదే. క్రిస్మస్ అంటే ఛాయ స్థానంలో దాని వాస్తవము రావడం: అమ్మ అడుగు పెట్టడమే చిన్న పిల్లవాడికి గొప్ప ఉపశమనం మరియు ఆనందం.