“వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి”. (మత్తయి 2:10-11)

దేవునికి ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. (అపొస్తలుల కార్యములు 17:25). సహాయం కోసమో లేదా అవసరాన్ని తీర్చడం కోసమో జ్ఞానులు ఆ బహుమతులు ఇవ్వలేదు. విదేశీ సందర్శకులు రాజసత్కార ప్యాకేజీలు తీసుకువస్తే, అది ఒక రాజును అవమానపరచినట్లే అవుతుంది.

అలాగే ఈ బహుమతులు లంచాలు కావు. దేవుడు లంచం తీసుకోడు అని ద్వితియోపదేశకాండము 10:17 చెబుతోంది. అప్పుడు వారు ఇచ్చిన బహుమతుల అర్థం ఏమిటి? అవి ఎలా ఆరాధనగా భావించబడతాయి?

ధనవంతులుకు, స్వయం సమృద్ధిగల వ్యక్తులకు ఇచ్చే బహుమతులు ఆ వ్యక్తి ఎంత అద్భుతమైనవాడో చూపించాలనే దాత యొక్క కోరికను ప్రతిధ్వనింప చేయడానికి, తీవ్రతరం చేయడానికి ఉపయోగపడతాయి. ఒక కోణంలో, క్రీస్తుకు బహుమతులు ఇవ్వడం ఉపవాసం లాంటిది – మీరు ఏదైతే లేకుండా వెళ్తున్నారో దానికంటే క్రీస్తు విలువైన వాడని చూపించడానికి ఏమీ లేకుండా పోవడం.

మీరు క్రీస్తుకు ఈ విధమైన బహుమతిని ఇచ్చినప్పుడు, ” నేను అన్వేషించే ఆనందం (మత్తయి 2:10 గమనించండి! “వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై”) ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా లేదా వ్యాపారం చేయడం ద్వారా ధనవంతులు కావాలనే ఆశతో నేను రాలేదు. నేను నీ దగ్గర నుంచి ఏదో తీసుకోవాలని నీ దగ్గరకు రాలేదు, నీ కోసమే వచ్చాను. మరియు నీవు ఇచ్చే వాటి మీద ప్రేమతో కాదుగానీ  నిన్ను మరింత ఆస్వాదించాలనే ఆశతో, నేను నాకున్నవాటిని వదులుకోవడం ద్వారా తీవ్రమైన నా కోరికను ప్రదర్శిస్తున్నాను. నీకు అవసరం లేనిది మరియు నేను ఆనందించగలిగే వాటిని ఇవ్వడం ద్వారా, నేను మరింత శ్రద్ధగా మరియు మరింత విశ్వసనీయంగా చెబుతున్నాను, ‘నువ్వే నా సంపద, ఇంకేవి కావు’.

బంగారము సాంబ్రాణి బోళము లేదా మనం దేవునికి ఇవ్వాలని అనుకోనే ఏ కానుకలతోనైనా దేవుడిని పూజించడం అంటే ఇదేనని నేను అనుకుంటున్నాను.దేవుడు మనలో క్రీస్తు పట్ల కోరికను మేల్కొల్పాలని ప్రార్థిస్తున్నాను. మనం హృదయంలో ఇలా చెప్పుకుందాం, “ప్రభువైన యేసు, నీవు మెస్సీయా, ఇశ్రాయేలు రాజువు. అన్ని దేశాలు వచ్చి నీ యెదుట నమస్కరిస్తాయి. మీరు పూజించబడడానికి దేవుడు ప్రపంచాన్ని నడిపిస్తాడు. కాబట్టి, నాకు ఎలాంటి వ్యతిరేకత వచ్చినా, నేను మీకు అధికారం మరియు గౌరవాన్ని ఆనందంగా ఆపాదిస్తాను మరియు మీరిచ్చే బహుమతులు కాదుగానీ మీరు మాత్రమే నా హృదయాన్ని సంతృప్తిపరచగలరని చెప్పడానికి నా బహుమతులను తీసుకువస్తాను.”

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *