“అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును. ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజ యైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు”. (1 కొరింథీ 15:35-38)
సృష్టిలో దేవుని సన్నిహితమైన జోక్యాన్ని చూపి౦చే లేఖన౦లోని చిన్న చిన్న విషయాలను నేను ఎత్తి చూపుతున్నాను.
ఉదాహరణకు, ఇక్కడ 1 కొరి౦థీ 15:38వ వచనంలో ఒక రూప౦లో నాటబడిన విత్తనం, మరొక రూపంలో ఎలాగైతే వస్తుందో అలాగే ఇతర శరీరాలన్ని౦టికన్నా భిన్నమైన “శరీర౦”తో బయటకి వస్తుందని పౌలు పోల్చి చెప్తున్నాడు. “దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు” (నా అనువాదం – ప్రతి “విధమైన” విత్తనానికి ఒక శరీరాన్ని ఇస్తాడని మూల భాషలో లేదు గాని ప్రతి విత్తనానికి దాని యొక్క స్వంత వినూత్న శరీరాన్ని ఇస్తాడని మూలభాషలో చెప్పబడింది!).
ప్రతి విత్తనం దాని శైలిలో ఒక వినూత్నమైన చెట్టు మొలిచే విధంగా దేవుడు రూపకల్పన (డిజైన్) చేసిన విధానంలో (ఆయా జాతి మొక్కలు మాత్రమే కాదు గాని ప్రతి విత్తనం మొలిచే విధానంలో!) దేవుని సన్నిహితమైన ప్రమేయానికి సంబంధించిందని చెప్పడం ఎంతో ప్రాముఖ్యమైన వ్యాఖ్య.
పౌలు ఇక్కడ పరిణామక్రమ౦ గురి౦చి బోధి౦చడ౦ లేదు సృష్టి విషయంలో దేవుడు కలిగియున్న ఆ సాన్నిహిత్యాన్ని అతడు తేలికగా తీసుకున్నాడు. దేవుని ప్రమేయం లేకుండా ఎటువంటి సహజ ప్రక్రియ ఆవిర్భావం అయ్యుండదని పౌలు ఉహించుకోలేడు.
కీర్తన 94:9వ చరణంలో మరొకసారి, “చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా?” అని చెప్తోంది. కంటి రూపకర్త దేవుడని, వినే పని చేసేందుకు తలలో చెవిని ఆయన రూపించాడని కీర్తనాకారుడు భావిస్తున్నాడు.
అందుచేత, మానవ కంటి అద్భుతాలను మరియు అద్భుతమైన చెవి నిర్మాణాన్ని చూసి మనం ఆశ్చర్యపోయినప్పుడు, మనం అనుకోకుండా జరిగే ప్రక్రియలను చూసి ఆశ్చర్యపోకూడదు, కానీ దేవుని మనస్సును, సృజనాత్మకతను మరియు శక్తిని చూసి ఆశ్చర్యపోవాలి.
అదేవిధంగా కీర్తన 95:5లో, “సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను.” భూమిని, సముద్రాన్ని సృష్టించడంలో దేవుని ప్రమేయం ఎలా ఉందంటే ప్రస్తుత సముద్రం ఆయనదే అన్నట్లుగా ఉంది.
ఇదంతా కోట్ల సంవత్సరాల క్రితమే ఆయన ఏదో ఒక పద్ధతిలో వీటన్నిటిని కదిలే విధంగా పెట్టినట్టు లేదు గాని వాటిని ఆయన సృష్టించాడు కాబట్టి అవన్నీ ఆయన సొంతం. ఒక కళాఖండాన్ని అమ్మే వరకు లేక ఇతరులకు ఇచ్చేంతవరకు అది గీసిన వ్యక్తికి సంబంధించినదిగా ఉంటుందన్నట్లుగా ఈ రోజు అవన్నీ ఆయన చేతిపని మరియు వాటిపై తమ సృష్టికర్త గుర్తులను కలిగి ఉన్నాయి.
ఈ విషయాలను నేను ఎత్తిచూపుతున్నది మూల సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి కాదు గాని ప్రపంచంలోని అద్భుతాలపట్ల మీ పరిశీలనలోను, మీరిచ్చే ప్రశంసలలోను పూర్తిగా దైవ స్పృహను కలిగి, దేవుణ్ణి మహిమ పరిచే విధంగా మరియు దేవునితో నిండిన వ్యక్తిగా మీరుండాలని మీకు పిలుపునిస్తూ ఈ విషయాలను నేను ఎత్తి చూపుతున్నాను.



