నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. (యెషయా 58:13-14).
దేవుణ్ణి మహిమపరచకుండ దేవుణ్ణి వెంబడించడమనేది సాధ్యమే. మనం దేవుణ్ణి మహిమపరచాలనే తపనను కలిగి ఉన్నట్లయితే, ఆయనతో ఉన్నటువంటి సహవాస ఆనందం కోసం మనం తప్పకుండ ఆయనను వెంబడిస్తాం.
దీనికి ఉదాహరణగా విశ్రాంతి దినాన్ని తీసుకోండి. దేవుని పరిశుద్ధ దినాన ప్రజలు తమకిష్టమైనవాటిని చేసేందుకు తాపత్రయపడేవారిని ఆయన గద్దిస్తున్నాడు. “నా పవిత్ర దినాన మీకిష్టమైన పనులు చేయకుండా, విశ్రాంతి దినము నుండి మీరు వ్యాపారము చేయకుండ ఉండాలి.” అయితే, ఇంతకి ఆయన ఏమని చెప్తున్నాడు? ప్రభువు దినాన మన ఆనందాలను నెరవేర్చుకోకూడదని ఆయన చెప్తున్నాడా? లేదు, ఆయన అలా చెప్పడం లేదు, ఎందుకంటే ఆ మాట తర్వాత వెనువెంటనే, “విశ్రాంతి దినం మనోహరమైనది” అని ఆయన చెప్తున్నాడు. “నీవు యెహోవాయందు ఆనందించెదవు” అని 14వ వచనం చెప్తోంది. అందుచేత, దేవుడు, విశ్రాంతి, పరిశుద్ధత అనే మనోహరమైనవాటియందు సబ్బాతు దినాన (విశ్రాంతి దినాన) ప్రజలు ఆనందించకుండా ఆ దినాన వారు తమ స్వంత వ్యాపారాలలో ఆనందిస్తున్నారన్నదే ఇక్కడ దేవుడు విమర్శిస్తున్న విషయం.
ఆయన తమ సుఖాలను (hedonism) గురించి గద్దించట్లేదు గాని దానికి సంబంధించిన బలహీనతను ఆయన గద్దిస్తున్నాడు. “మనం ఎంతో సులభంగా లొంగిపోతాం (ఓడిపోతాం)” అని సి.ఎస్. లూయిస్ గారు చెప్పినట్లుగా, మనం చాలా సులభంగా లొంగిపోతాం (ఓడిపోతాం). వారు లౌకిక ప్రయోజనాల కోసం స్థిరపడ్డారు, తద్వారా వారు ప్రభువుకంటే ఎక్కువగా వాటిని గౌరవిస్తారు.
విశ్రాంతి దినాన్ని “మనోహరమైనది” అని పిలవడ౦, యెహోవా పరిశుద్ధ దినాన్ని “ఘనమైనది” అని పిలవడంతో సమానమని గమని౦చ౦డి. “మీరు విశ్రాంతి దినాన్ని మనోహరమైనదని మరియు ప్రభువు యొక్క పవిత్ర దినం ఘనమైనదని పిలిచినట్లయితే,” మీరు ఆనందించేదాన్ని ఘనపరుస్తున్నారని లేదా మీరు ఆనందించేదాన్ని మహిమపరుస్తున్నారని అర్థం.
దేవునిలో ఆనందించడం మరియు దేవుణ్ణి మహిమపరచడం అనేవి రెండూ ఒకటే. ఆయన శాశ్వత ఉద్దేశం మరియు మన శాశ్వత ఆనందం ఆరాధన అనే ఒకే అనుభవంలో ఏకమై ఉంటాయి. దీని కోసమే ప్రభువు దినం ఉంది. వాస్తవానికి, దీని కోసమే జీవితమంతా ఉంది.