“ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఏలాగు తప్పించుకొందుము?” (హెబ్రీ 2:3) 

మీ రక్షణ గురించి మీ మనస్సులో గొప్ప భావనను కలిగియున్నారా? లేక మీరు మీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారా?

మీరు కలిగియున్న గొప్ప రక్షణ విషయమై మీరు స్పందిస్తున్నారా? లేక మీరు వ్రాసిన చివరి వీలునామాలాగా, చివరి నిబంధనలాగా, లేక మీ కారుకు మీరు పెట్టుకున్న ఒక బిరుదులాగా, లేక మీ ఇంటి మీద మీరు కలిగియున్న చట్టపరమైన పట్టాలాగా మీ రక్షణతో మీరు వ్యవహరిస్తున్నారా? మీరు దాని మీద ఒకసారి సంతకం చేసి, దానిని ఏ పెట్టెలోనో పెట్టుంటారు గాని అది వాస్తవానికి మీ మనస్సులో గొప్ప విషయంగా ఉండదు. దాని గురించి చాలా అరుదుగా ఆలోచిస్తారు. అది ప్రతి రోజు మీ మీద ఎటువంటి ప్రభావం చూపించదు. వాస్తవానికి మీరు దానిని నిర్లక్ష్యం చేస్తారు.

అయితే, మీ గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు, వాస్తవానికి మీరు దేనిని నిర్లక్ష్యం చేస్తున్నారు? “మీ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు” అని ఆయన చెప్పినప్పుడు, ఆయన ఏమి చెప్తున్నాడో ఈ క్రింద గమనించగలరు. 

  • దేవునిచేత ప్రేమించబడటాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 
  • సర్వశక్తివంతుడైన దేవుని ద్వారా క్షమించబడుటకు, అంగీకరించబడుటకు, సంరక్షించబడుటకు మరియు మార్గదర్శనం పొందుకొనుటకు నిర్లక్ష్యం చేయవద్దు. 
  • సిలువలో క్రీస్తు ప్రాణ త్యాగాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 
  • విశ్వాసం ద్వారా ఆపాదించబడిన నీతి అనే ఉచిత బహుమానాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 
  • సమాధానపరచబడిన దేవుని చిరునవ్వును మరియు తొలగించబడిన దేవుని ఉగ్రతను నిర్లక్ష్యం చేయవద్దు. 
  • ప్రేమించే క్రీస్తు స్నేహాన్ని, సహవాసాన్ని మరియు మనలో నివాసమై ఉన్న పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయవద్దు. 
  • యేసు ముఖంలోని దేవుని మహిమ ప్రకాశమును నిర్లక్ష్యం చేయవద్దు. 
  • కృపాసనాన్ని సమీపించే ఉచితమైన కృపను నిర్లక్ష్యం చేయవద్దు. 
  • వివరించలేని దేవుని వాగ్దానాల నిధిని నిర్లక్ష్యం చేయవద్దు అని ఆయన చెప్తున్నాడు. 

ఇదే నిజమైన గొప్ప రక్షణ. నిర్లక్ష్యం చేయడమనేది దుష్ట సంబంధమైనది. అందుచేత, గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు. ఒకవేళ అలా నిర్లక్ష్యం చేసినట్లయితే, తీర్పునుండి తప్పించుకోవడానికి సాధ్యపడుతుందా? అందుకనే, “ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?” అని గ్రంథకర్త అడుగుతున్నాడు. 

కాబట్టి, క్రైస్తవులుగా ఉండటమనేది చాలా తీవ్రమైన విషయం, ఇదేదో నిర్లక్ష్యం చేసే విషయం కాదు గాని ఎంతో తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. మన పొందుకున్న గొప్ప రక్షణలో సంతోషంగా ఉండేదాని గురించి మనం అర్థవంతంగా ఉండాలి. 

ఈ లోకంలోని తాత్కాలిక మరియు హానికరమైన పాపపు ఆనందాల వైపు దారి తీసేందుకు వీలు కల్పించము. దేవునిలో మనకున్న నిత్యానందాన్ని మనం నిర్లక్ష్యం చేయము, ఇదే ఈ రక్షణకున్న లక్ష్యం. అటువంటి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయడానికి బదులుగా మన కళ్ళను మనం పెరికివేయడం మేలు. 

Author

  • జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

జాన్ పైపర్
జాన్ పైపర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *