“నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.” (మత్తయి 6:30)

చింతకు మూలం ఏంటంటే మన తండ్రి అనుగ్రహించే భవిష్యత్ కృపలో అరకొర విశ్వాసాన్ని కలిగి ఉండడమని, అంటే “అల్ప విశ్వాసం” కలిగి ఉండడమని యేసు చెప్తున్నాడు. 

ఈ విషయంలో మన స్పందన ఇలా ఉండొచ్చు, “ఇది శుభవార్త కాదు! వాస్తవానికి చింతతో నిండియున్న స్వభావంతో పోరాటం మాత్రమేనని నేను భావించినదానికి బదులుగా, నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నానా లేదా అనే స్వభావంతో చేసే చాలా లోతైన పోరాటమని నేర్చుకోవడం అత్యంత నిరుత్సాహకరమైన విషయం.”

ఈ నిరుత్సాహానికి నా ప్రతిస్పందన ఏదనగా దానిని అంగీకరించడం, ఆ తర్వాత దానిని విభేదించడం. ఎందుకనగా,

మీరు కడుపు నొప్పితో బాధపడి, అన్ని రకాల మందులు వాడి మరియు అన్ని రకాల పత్యాలు పాటించి, ఎన్ని ప్రయత్నించినా ప్రయోజనం లేదనుకోండి. అప్పుడు, సాధారణమైన వైద్య పరీక్షకు వెళ్ళినప్పుడు, మీ చిన్న ప్రేగులో క్యాన్సర్ ఉందని మీ డాక్టర్ మీకు చెప్పారనుకోండి. అప్పుడది శుభవార్త అవుతుందా? నిరభ్యంతరంగ కాదు అని మీరు చెబుతారు కదా! దాన్ని నేను అంగీకరిస్తున్నాను.

అయితే, నేను మరొక విధంగా ప్రశ్న అడుగుతాను: క్యాన్సరుకు చికిత్స చేయగలిగిన అవకాశం ఉన్నప్పుడే, అది కూడా చాలా విజయవంతంగా చికిత్స చేయగలిన అవకాశమున్నప్పుడు ఆ సంగతిని డాక్టర్ కనుగొన్నందుకు మీరు సంతోషంగా ఉన్నారా? అవును, అసలైన సమస్యను డాక్టర్ కనుగొన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మీరంటారు. దాన్ని కూడా నేను అంగీకరిస్తున్నాను.

అందుచేత, మీకు క్యాన్సర్ ఉందనే వార్త శుభ వార్త కాదు గాని మరొక రీతిగా అది శుభవార్తే. ఎందుకంటే, నిజంగా లోపమును తెలుసుకోవడమనేది మంచి విషయం, ముఖ్యంగా మీకున్న సమస్యకు విజయవంతంగా చికిత్స చేయవచ్చని తెలిసినప్పుడు అది మరి ఎక్కువ మంచి విషయం కదా. 

దేవుని భవిష్యత్ కృపా వాగ్దానాలలో “అల్ప విశ్వాసం” (యేసు చెప్పినట్లుగా) కలిగి ఉండడమే చింతకు వెనకున్న నిజమైన సమస్య. “నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా” (మార్కు 9:24) మనం మొర పెట్టినప్పుడు, అద్భుతంగా స్వస్థపరిచే విధానాల ద్వారా ఆయన కార్యం చేయడానికి సమర్థుడు. 

Author

  • జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *