“నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి”. (మత్తయి 5:11-12)
క్రైస్తవులుగా శ్రమలలో ఆనందించడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయని క్రైస్తవ హెడోనిజం (Christian Hedonism) చెప్తోంది. సమస్తానికి చాలిన, సమస్తాన్ని తృప్తిపరచగలిగిన దేవుని కృపకు వ్యక్తీకరణగా వాటినన్నిటిని కొనసాగించాలి.
పునరుత్థానంలో మనకు లభించేటువంటి గొప్ప బహుమానం మీద మన మనస్సులను స్థిరపరచుకోవడం ద్వారా శ్రమలలో ఆనందించే ఒక విధానం వస్తుంది. ఇటువంటి విధానం యొక్క ప్రభావం రాబోయే దానితో పోల్చినప్పుడు మన ప్రస్తుత శ్రమను ఎన్నికలేనిదిగా చేస్తుంది: “మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను” (రోమా 8:18; 2 కొరింథీ 4:16-18). శ్రమను సహించేలా చేయడంలో, మన బహుమానాన్నిబట్టి మనం సంతోషించడం ద్వారా ప్రేమించడం సాధ్యమౌతుంది.
“మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును” (లూకా 6:35). పేదవారిపట్ల ధారాళ గుణాన్ని కలిగి ఉండు, “నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను” (లూకా 14:14). వాగ్దానం చేయబడిన ఈ బహుమానంలో (ఫలంలో) నిశ్చయతను కలిగియున్నప్పుడు లోకపు సంబంధం తెగిపోయి, ప్రేమను పంచడానికి మనల్ని స్వతంత్రులనుగా చేస్తుంది.
శ్రమలలో ఆనందించే మరొక విధానం, మనకున్న భరోసాతో కూడిన నిరీక్షణనుబట్టి కలిగే శ్రమల ప్రభావాలనుండి వస్తుంది. శ్రమలలో ఆనందించడం అనేది కేవలం పునరుత్థానం మరియు బహుమానం అనేటువంటి నిరీక్షణ మీదనే ఆధారపడి లేదు గాని ఆ నిరీక్షణను మరింత ఎక్కువగా బలపరచడానికి శ్రమలు తమంతటికవే పనిచేసే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు, “అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము” (రోమా 5:3-4) అని పౌలు చెప్తున్నాడు.
మరొక విధంగా చెప్పాలంటే, పౌలు గారి ఆనందం ఆయన పొందబోయే గొప్ప బహుమానంలో మాత్రమే లేదు గాని ఆ బహుమానం విషయమైన నిరీక్షణను దృఢపరిచే శ్రమల ప్రభావంలో కూడా ఉంది. శ్రమ ఓర్పును, ఆ ఓర్పు మన విశ్వాసం నిజమైనది, అధికారికమైనదేననే భావనను మరియు మనం నిజంగా క్రీస్తును సంపాదించుకుంటామన్న మన నిరీక్షణను బలపరుస్తుందనే భావనను కలుగజేస్తుంది.
కాబట్టి, పొందబోయే గొప్ప బహుమానం మీద లేదా శ్రమల శుద్ధీకరణ ప్రభావాల మీద, దృష్టి పెట్టినా పెట్టకపోయినా, శ్రమలలో మనం ఆనందాన్ని కొనసాగించాలన్నదే దేవుని ఉద్దేశం.



