“ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను”. (కొలొస్స 1:24)
పాపుల కోసం క్రీస్తు శ్రమలను అనుభవించి, చనిపోవడం ద్వారా లోకం కోసం ఆయన తన ప్రేమను వెల్లడి చేసియున్నాడు. ఇది పరిపూర్ణమైన అర్పణ. ఈ అర్పణ ప్రజలందరి పాపాల కోసం చెల్లించిన అర్పణ. ఇది ఉత్తమ బహుమానం అవ్వడం కోసం దానికి మరొకటి జతపరచనక్కరలేదు. క్రీస్తు తనను తాను లోకంలోని సమస్త దేశాలన్నిటికీ వ్యక్తపరుచుకోవడం తప్ప దానికి ఎటువంటి కోరతనేదే లేదు.
ఈ కొరతకు దేవుని జవాబు ఏంటంటే లోకానికి క్రీస్తు శ్రమలను వ్యక్తిగతంగా కనపరచడానికి క్రీస్తు ప్రజలను (అంటే, పౌలువంటి ప్రజలను) పిలవడమే. ఈ విధంగా చేయడంలోనే “కీస్తు బాధలలో కొదువైన దానిని మనం సంపూర్ణం చేయగలుగుతాం.” అంటే, వాటికున్న అత్యున్నతమైన విలువను ఎరుగని ప్రజలకు వాటిని పరిచయం చేయడం ద్వారా వాటి ఉద్దేశాన్ని పూర్తిగా నేరవేరుస్తాం.
అయితే, కొలొస్సయుల పత్రిక 1:24 వచనాన్ని గురించి అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే క్రీస్తు శ్రమలలో కొదువైనదానిని పౌలు ఎలా సంపూర్ణం చేస్తున్నాడో గమనించడమే.
క్రీస్తు శ్రమలలోని కొదువను సంపూర్ణం చేయగలిగేది అతను అనుభవిస్తున్న శ్రమలేనని పౌలు చెప్తున్నాడు. అంటే, ఎవరినైతే క్రీస్తు కోసం సంపాదించాలనుకుంటున్నాడో వారి కోసం శ్రమపడుట ద్వారా క్రీస్తు శ్రమలు ఎలాంటివో చూపిస్తున్నాడు. పౌలు గారు పొందుతున్న శ్రమలలో వారు క్రీస్తు శ్రమలను చూడాలన్నమాట.
ఇక్కడ ఆశ్చర్యకరమైన ఒక పరిణామం ఉంది: తన ప్రజలు అనుభవించే శ్రమల ద్వారా క్రీస్తు శ్రమలను లోకానికి కనపరచాలని దేవుని ఉద్దేశం.
క్రీస్తు శరీరమనే సంఘం ఆయన అనుభవించిన శ్రమలలోని కొన్ని శ్రమలను అనుభవించాలని దేవుడు నిజంగా కోరుకుంటున్నాడు. తద్వారా, జీవ మార్గం సిలువేనని మనం ప్రకటిస్తున్నప్పుడు, ప్రజలందరు మనలో సిలువ గుర్తులను చూస్తారు మరియు మన నుండి సిలువ ప్రేమను పొందుకుంటారు.



