“అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను”. (2 కొరింథీ. 12:9)

క్రైస్తవులందరి శ్రమల విషయంలో దేవుని విశ్వవ్యాప్త ఉద్దేశ్యం: దేవునిలో ఎక్కువ సంతృప్తి కలిగి తనపై అలాగే లోకంపై తక్కువ ఆధారపడటం. “నెమ్మదిగా మరియు సుఖంగా ఉండే సమయాల ద్వారా లోతైన పాఠాలు నేర్చుకున్నాను” అని ఎవరూ చెప్పడం నేను ఎప్పుడూ వినలేదు.

కానీ బలమైన పరిశుద్ధులు ఇలా చెప్పడం నేను విన్నాను, “దేవుని ప్రేమ యొక్క లోతులను గ్రహించడంలో మరియు ఆయనలో లోతుగా ఎదగడంలో పురోగతి, శ్రమల ద్వారా వచ్చింది.”

అత్యంత విలువైన ముత్యము క్రీస్తు మహిమ.

ఈ విధంగా, మన శ్రమలలో క్రీస్తు యొక్క సర్వ-సమృద్ధి కృపా మహిమ విస్తరిస్తుందని పౌలు నొక్కిచెప్పాడు. మన విపత్తులో మనం ఆయనపై ఆధారపడినట్లయితే, ఆయన మన “నిరీక్షణతో కూడిన ఆనందాన్ని” కాపాడుతాడు, ఆయన సర్వ-సంతృప్తికరమైన కృపాబలములుగల దేవుడిగా ఉంటాడు.

“మన చుట్టూ ఉన్నవి కోల్పోయినప్పుడు” మనం ఆయనను గట్టిగా పట్టుకుంటే, మనం పోగొట్టుకున్న వాటి కంటే ఆయనే ఎక్కువ కోరదగినవాడనే సత్యాన్ని చూపించగలుగుతాం.

క్రీస్తు శ్రమపడుతున్న అపొస్తలునితో, “నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని” చెప్పాడు. దానికి పౌలు ఇలా స్పందించాడు: “కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందె బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను” (2 కొరింథీయులు 12:9-10)

కాబట్టి శ్రమ అనేది క్రైస్తవులను స్వచిత్తం నుండి దూరం చేసి కృపకు దగ్గర చేయడం మాత్రమే కాకుండా, ఆ కృపను గుర్తించి దానిని ప్రకాశింపజేయడానికి ఒక మార్గంగా కూడా దేవుడు స్పష్టంగా రూపొందించాడు. విశ్వాసం ఖచ్చితంగా అదే చేస్తుంది: ఇది క్రీస్తు భవిష్యత్ కృపను గొప్పగా చేస్తుంది.

దేవునిలోని లోతైన విషయాలు శ్రమలలో కనుగొనబడ్డాయి మరియు పెద్దవిగా చేయబడ్డాయి.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *