“పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను”. (హెబ్రీయులు 1:1-2)
కుమారుడు ఈ లోకంలోకి రావడంతో అంత్య దినములు ప్రారంభమయ్యాయి. “ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను.” క్రీస్తు దినముల ప్రారంభం నుండి అంటే, మనకు తెలిసిన దేవుని రాజ్య అంతిమ పరిపూర్ణ స్థాపనకు ముందు ఉన్న దినములు, చరిత్రలోని చివరి దినములలో జీవిస్తున్నాము.
హెబ్రీ పత్రిక రచయిత యొక్క ఉద్దేశ్యం ఇది: దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడిన మాటలు నిర్ణయాత్మకమైన అంతిమ మాటలు. కుమారుని స్వంత నిర్ణయం ద్వారా, యుగయుగాల కొరకు ఆ మాటలు కొత్త నిబంధన ప్రతులలో వ్రాయబడ్డాయి. నిర్ణయాత్మకమైన ఆఖరి దేవుని మాటలను కలలు ద్వారా ప్రతి తరమూ తనకు తానుగా తెలుసుకోవాలని వదిలేయకుండా దేవుడు దీని కోసం ఒక స్పష్టమైన ఏర్పాటు చేశాడు. ఈ మాటల తరువాత ఏ యుగంలో వీటికంటే గొప్ప మాటలు లేదా వీటిని భర్తీ చేసే మాటలు ఉండవు. ఇది దేవుని వాక్యం — యేసుక్రీస్తు, ఆయన యొక్క బోధ మరియు యేసు చేసిన కార్యాలు, మనం కొత్త నిబంధన అని పిలుస్తున్న అపొస్తలుల రచనలలో దైవ ప్రేరణ ద్వారా వ్రాయబడ్డాయి.
నేను దేవుని మాటలు వినడం లేదని ఫిర్యాదు చేసినప్పుడు, దేవుని స్వరాన్ని వినాలని నాకు కోరికగా అనిపించినప్పుడు మరియు నేను కోరుకునే విధంగా ఆయన నాతో మాట్లాడలేదని నిరాశ చెందినప్పుడు, నేను నిజంగా ఏమి చెప్తున్నాను? క్రొత్త నిబంధనలో నాకు చాలా పూర్తిగా మరియు తప్పుపట్టలేని విధంగా బయలుపరచబడిన ఈ చివరి, నిర్ణయాత్మకమైన వాక్యం మొత్తం చదివేశాను అని చెబుతున్నానా? నేను ఈ వాక్యమును పూర్తిగా అవ్వగొట్టేసానా? నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది నాకు జీవితాన్ని మరియు మార్గదర్శకాన్ని ఇచ్చేంతగా ఇది నాలో చాలావరకు భాగం అయిపోయిందా?
లేదా నేను దానిని చులకనగా చూస్తున్నానా?- వార్తాపత్రికను చూసినట్లుగా దీనిని ఊరికే పైపైన చూస్తున్నానా?, ఇంటర్నెట్ పోస్టింగ్‌లను త్వరత్వరగా క్లిక్ చేసి చూసినట్లుగా చూస్తున్నానా?, రుచిని ఆస్వాదిస్తున్నట్లుగా చూస్తున్నానా? – ఆ తరువాత నేను వేరేది ఏదైనా, కొద్దిగా ఎక్కువ కావాలని నిర్ణయించుకున్నానా? పైన చెప్పినట్లుగా నేను అంగీకరించాలనుకునే దానికంటే ఎక్కువ నేరాన్ని కలిగి ఉన్నానని నేను భయపడుతున్నాను.
తన చివరిదైన, నిర్ణయాత్మకమైన, తరగని వాక్యాన్ని వినడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు – అది మనలని పూర్తిగా నింపే వరకు దానిని ధ్యానం చేయడానికి, దానిని అధ్యయనం చేయడానికి, దానిని గుర్తుంచుకోవడానికి, దానిలో ఎక్కువ సమయం గడపడానికి మరియు దానిలో మునిగిపోడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు.