“ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు”. (నిర్గమకాండము 34:14)

దేవుడు తన నామ ఘనత కోసం అనంతమైన రోషము కలిగి ఉంటాడు మరియు తన జీవిత భాగస్వామి మరొక ప్రేమికుడి వెంట పరుగెత్తినట్లు ఆయనకు చెందాల్సిన హృదయాలు వేరే వాటిని వెంబడిస్తే భయంకరమైన కోపంతో స్పందిస్తాడు.

ఉదాహరణకు, యెహెజ్కేలు 16:38–40లో విశ్వాసం లేని ఇశ్రాయేలుతో ఇలా అన్నాడు,

“జారిణులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి, క్రోధముతోను రోషముతోను నీకు రక్తము నియమింతును. వారి చేతికి నిన్ను అప్పగించెదను,నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి . . . నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసికొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు. వారు నీమీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు, కత్తులచేత నిన్ను పొడిచి వేయుదురు.”

ఈ హెచ్చరికను వినవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ విభజించబడని ప్రేమ మరియు భక్తి విషయంలో అంతిమ నిర్ణయాలు తీసుకునే హక్కు దేవుని రోషానికే ఉంది. మోసపూరిత ఆకర్షణతో మీ ప్రేమను దేవుని నుండి దూరం చేసేవన్నీ మిమ్మల్ని దిగంబరులుగా చేసి ముక్కలుగా చేయడానికి తిరిగి వస్తాయి.

దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని సర్వశక్తిమంతుడికి వ్యతిరేకంగా వ్యభిచారం చేయడానికి ఉపయోగించడం చాలా భయంకరమైన విషయం.

కానీ మీలో నిజంగా క్రీస్తుతో ఏకమై ఉన్నవారు, ఇతరులందరినీ విడిచిపెట్టి, ఆయనను మాత్రమే అంటిపెట్టుకుని, ఆయన ఘనత కోసం జీవించాలనే వారికి – దేవుని రోషం మీకు గొప్ప ఓదార్పు మరియు గొప్ప నిరీక్షణగా ఉంటుంది.

దేవుడు తన నామ ఘనత నిమిత్తమై అనంతమైన రోషంతో ఉన్నాడు కాబట్టి, నమ్మకమైన తన భార్య విషయంలో జరిగే మంచికి అడ్డుగా ఏదైనా మరియు ఎవరైనా వస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు వ్యతిరేకిస్తాడు. నమ్మకమైన భార్యకు – దేవుని నమ్మకమైన ప్రజలకు ఇది శుభవార్త.వ్యభిచారిణుల వలె, తమ హృదయాన్ని లోకానికి అమ్ముకుని, వేశ్యభర్త అనే ముద్ర వేసి దేవున్ని నవ్వులపాలు చేసేవారికి దేవుని రోషము గొప్ప ముప్పు (యాకోబు 4:3-4). అయితే తమ నిబంధన ప్రమాణాలను పాటించి, లోకంలో అపరిచితులుగా మరియు ప్రవాసులుగా మారినవారికి ఆయన రోషం గొప్ప ఓదార్పునిస్తుంది.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *