“క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము”. . . (ఎఫెసీయులు 2:6)
క్రీస్తు రెండవ రాకడను గురించి బైబిల్ ఇచ్చే అత్యంత ఆశ్చర్యకరమైన చిత్రం లూకా 12:35-37లో ఉంది, ఇది వివాహ విందు నుండి యజమాని తిరిగి రావడాన్ని ఈ విధంగా చిత్రీకరిస్తుంది:
“మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురుచూచు మనుష్యులవలె ఉండుడి. ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
ఖచ్చితంగా చెప్పాలంటే, మనల్ని సేవకులు అంటారు – మరియు నిస్సందేహంగా మనము చెప్పింది చెప్పినట్లు ఖచ్చితంగా చేయాలని అర్థం. కానీ ఈ చిత్రం యొక్క అద్భుతం ఏమిటంటే “ప్రభువు” సేవ చేయాలని పట్టుబట్టారు. “మనుష్యకుమారుడు సేవ చేయించుకొనుటకు రాలేదు గాని సేవ చేయుటకు మరియు అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను” అని మార్కు 10:45లో చెప్పాడు కాబట్టి యేసు భూమిమీద పరిచర్య చేసే సందర్భం గురించి ఈ వాక్యం మాట్లాడుతుందని మనం అనుకోవచ్చు. కానీ లూకా 12:35-37 రెండవ రాకడను గూర్చి మాట్లాడుతుంది. మనుష్యకుమారుడు కళ్ళు మినిమిట్లు గొలిపే తన తండ్రి యొక్క మహిమతో “తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ” వస్తాడు అని 2 థెస్సలొనీకయులు 1:6 లో చెప్పబడింది. అయితే రెండవ రాకడలో యేసు సేవకుడుగా (టేబుల్ వెయిటర్‌గా) ఎందుకు చిత్రీకరించబడ్డాడు?
ఎందుకంటే ఆయన మహిమ యొక్క ప్రాముఖ్యత ఏదనగా అవసరాల్లో ఉన్న ప్రజల పట్ల దయ పొంగిపొర్లుతున్న ఆయన కృప యొక్క పరిపూర్ణతయే. అందుకే ఎఫెసీ 2:6, “క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము”, లక్ష్యంగా పెట్టుకున్నాడు.
మన దేవుని గొప్పతనం ఏమిటి? ప్రపంచంలో ఆయన ప్రత్యేకత ఏమిటి? యెషయా సమాధానమిస్తున్నాడు: “తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు” (యెషయా 64: 4). ఇలాంటి దేవుడు మరొకడు లేడు. ఎప్పుడూ తనపై ఆధారపడిన, సంతోషంగా ఉన్న ప్రజల తరగని శ్రేయోభిలాషి పాత్రను ఆయన వదులుకోడు.



