దేవుణ్ణి సేవించే విషయంలో జాగ్రత్త వహించండి

దేవుణ్ణి సేవించే విషయంలో జాగ్రత్త వహించండి

షేర్ చెయ్యండి:

“జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు”. (అపొ. కార్యాలు 17:24–25)

మనం దేవునికి ఆయన అవసరాలను అందించడం ద్వారా మహిమపరచలేము, కానీ ఆయన మన అవసరాలను తీర్చగలడని ప్రార్థించడం ద్వారా – మరియు సమాధానం ఇస్తాడని విశ్వసించడం ద్వారా మరియు ఇతర వ్యక్తుల పట్ల ప్రేమతో మన జీవితాలను అర్పించినప్పుడు, శ్రద్ధతో  అన్నీ సమకూరుస్తాడనే నమ్మకంతో  ఆనందంగా  జీవించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు.

ఇక్కడ మనం క్రైస్తవ హీడోనిజం (సుఖమే ప్రధానం అనే సిద్ధాంతం) అందించే శుభవార్తలోని ప్రాముఖ్యమైన అంశం దగ్గర ఉన్నాము. ఆయన మహిమ పొందేలా సహాయం చేయమని మనం ఆయనను అడగాలని దేవుని పట్టుదల. “ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు” (కీర్తన 50:15). ఇది, ఆయనకు  మనం అవసరమనే ఆలోచన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఆశ్చర్యకరమైన సత్యాన్ని మనలో బలపరుస్తుంది. మనం దేవుణ్ణి సేవించే విషయంలో జాగ్రత్త వహించాలి మరియు ఆయన మహిమను మనం దోచుకోకుండా ఉండేందుకు ఆయన మనకు సేవ చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. “తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు” (అపొస్తలుల కార్యములు 17:25).

ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మనలో చాలామంది దేవుణ్ణి సేవించడం పూర్తిగా సానుకూలమైన విషయం అని అనుకుంటారు. దేవుణ్ణి సేవించడం బహుశా ఆయనను అవమానించడమేనని మనము భావించము. కానీ ప్రార్థన యొక్క అర్థాన్ని ధ్యానించడం ద్వారా దీనిని స్పష్టంగా అర్ధం చేసుకోగలం.

ఒక నవలలో, రాబిన్సన్ క్రూసో అనే హీరో, అతను ద్వీపంలో చిక్కుకుపోయినప్పుడు కీర్తన 50:12-15ని తన అభిమాన వచనంగా నిరీక్షణ కోసం తీసుకున్నాడు: దేవుడు ఇలా అంటాడు, “లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను. . . ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు.”

దీని యొక్క అర్థం: మన సేవ అవసరత దేవునికి ఉంది అనే విధంగా మనం సేవ చేస్తే ఆయనను తక్కువ చేసినవారము అవుతాము. క్రీస్తులో దేవుని గొప్ప దయను నిరోధించకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. యేసు చెప్పాడు, “మనుష్యకుమారుడు సేవ చేయించుకొనుటకు రాలేదు గాని సేవ చేయుటకు మరియు అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను” (మార్కు 10:45). ఆయన సేవకుడిగా ఉండటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇవ్వడం ద్వారా కీర్తిని పొందాలనే లక్ష్యంతో ఉన్నాడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...