ఘోర పాపుల కోసం నిరీక్షణ
“నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను”. (నిర్గమ 33:19)
విగ్రహారాధన చేసి, ఐగుప్తు ను౦డి విడిపించిన దేవుణ్ణి తిడుతూ మెడ వంచని ప్రజలపై దేవుడు నిజ౦గా కరుణ చూపిస్తాడనే నిరీక్షణ మోషేకు అవసరం.
మోషేకు అవసరమైన నిరీక్షణను, నిశ్చయతను ఇవ్వడానికి, “నేను కరుణించువాని కరుణించెదను” అని దేవుడు చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే, “నేను తీసుకునే నిర్ణయాలు మనిషిలో ఉండేటువంటి మంచి చెడులపై ఆధారపడి ఉండవు, గానీ నా స్వేచ్ఛా పూర్వకమైన సార్వభౌమాధికార సంకల్పంపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. అందుచేత, ఒక వ్యక్తి కృప చూపబడడానికి వీలులేనంత చెడ్డవాడు అని ఎవరూ అనలేరు.” ఒకవేళ ఆలా చెప్తే దేవునికి స్వేచ్ఛ లేదని మరియు ఎన్నిక బేషరతు (షరతులు లేనిది) కాదనే అర్థం వస్తుంది.
షరత్తులు లేకుండ ఎంపిక చేసుకోవడం అనే సిద్ధాంతం ఘోరమైన పాపుల కోసం నిరీక్షణతో కూడిన గొప్ప సిద్ధాంతం. కృపను పొందుకునే వ్యక్తిగా మీరున్నప్పుడు మీ నేపథ్యముతో దేవుని ఎంపికకు ఎటువంటి సంబంధం లేదని దీని అర్థం. ఇది శుభవార్తే.
మీరు తిరిగి జన్మించి, యేసు క్రీస్తునందు రక్షించు విశ్వాసమునకు తీసుకురాబడనివారుగా ఉంటే, మీ జీవితంలో దేవుని కృపా కార్యానికి ఎన్నడూ అధిగమించలేని అడ్డుబండగా మీ గత జీవితపు కాఠిన్యం లేక కుళ్ళిన స్థితి ఎక్కువగా ఉందనే నిరాశతో కూడిన ఆలోచనలోనికి దిగిపోకండి. ఘోరమైన పాపులను రక్షించడం ద్వారా ఆయన కృపా స్వేచ్ఛను గొప్ప చేయడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు.
మీ పాపము నుండి వెనుదిరిగి, ప్రభువుకు ప్రార్థన చేయండి. ప్రతి రోజు మీరు చదువుతున్న లేదా వింటున్న ఈ అనుదిన ధ్యానాలలో, ఆయన మీపట్ల కృప చూపుతూ కరుణ కోసం ఆయన వద్దకు రావడానికి మీకు బలమైన ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు.
“యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు – రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లనివగును.” (యెషయా 1:18)
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web