ఈ లోకసుఖం సరిపోదు

ఈ లోకసుఖం సరిపోదు

షేర్ చెయ్యండి:

“భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు”. (మత్తయి 6:19-20)

లోక సంబంధమైన మనిషి, నీవు కేవలం సుఖభోగాలను కలిగి ఉంటే సరిపోదు అని శ్రీమంతుల కుటుంబాల నుండి బాగా గట్టిగా అరిచి చెప్పాల్సిన సందేశమిది!

తుప్పు, ద్రవ్యోల్బణం చిమ్మటలు తినే కొద్దిపాటి 2 శాతం ఆనందంతో తృప్తిపడటం మానేయండి. అధిక రాబడి వచ్చే బ్లూ-చిప్ స్టాక్స్ లాంటి దైవిక సంబంధమైన పరలోకపు భద్రతలలో పెట్టుబడి పెట్టండి.

భౌతిక సౌకర్యాలు, భౌతిక భద్రత మొదలగు విషయాలకు జీవితాన్ని అంకితం చేయడమనేది ఎలుకలుండే గుంతలో డబ్బులు పారేయడంలాంటిది. కానీ ప్రేమను పంచే పనిలో పడే ప్రయాసలో జీవితాన్ని పెట్టుబడి పెట్టడంవల్ల అసమానమైన, అంతులేని ఆనంద ఫలాలు లభిస్తాయి:

“మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించు కొనుడి; అక్కడికి దొంగరాడు, చిమ్మెటకొట్టదు” (లూకా 12:33).

ఈ సందేశం ఎంతో గొప్ప శుభ వార్త: ఎవరి సన్నిధిలోనైతే సంపూర్ణ ఆనందం, సంపూర్ణ సుఖములు శాశ్వతంగా ఉంటాయో ఆ క్రీస్తు వద్దకు రండి. క్రైస్తవ సుఖం యొక్క ప్రయాసలో (Christian Hedonism) మాతో కలవండి. ఎందుకంటే, సుఖ సంతోషాలు కలిగి (లగ్జరీలో) బ్రతకడంకంటే ప్రేమించడం ఎంతో దీవెనకరమైనదని ప్రభువు చెప్పాడు! ఇప్పుడు ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగా ఉండండి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...