వివరించలేని మన ధన్యత
“దేవుడు – “నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని” మోషేతో చెప్పెను”. (నిర్గమ 3:14)
యేసు క్రీస్తులో అనంతమైన, సంపూర్ణమైన, స్వయం నిర్ణయాధికారం కలిగిన దేవుడు మనకు దగ్గరయ్యాడని నేను ఉన్నవాడను అనువాడై ఉన్నాను అనే గొప్ప నామానికున్న ఒక భావము.
యోహాను 8:56-58 వచనాలలో యేసు యూదా నాయకుల విమర్శలకు జవాబిచ్చాడు. “మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు – నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు – అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు చెప్పెను.
“అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని” యేసు చెప్పినప్పుడు, ఆయన నోట నుండి గొప్పలు చెప్పుకునే మాటలేవైనా వచ్చాయని అంటారా? దేవుని నామములోని అద్భుతమైన సత్యాన్ని ఆయన తీసుకొని, దానిని సేవకత్వపు వినయంలో చుట్టి, మన తిరుగుబాటు కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన తన్ను తాను సమర్పించుకొని, ఎటువంటి భయం లేకుండా ఈ అనంతమైన, సంపూర్ణమైన, అన్నిటిని కలిగియున్న దేవుని మహిమను చూడటానికి మనకోసం మార్గాన్ని ఏర్పరిచాడు.
దేవుని మూలముగా యేసు క్రీస్తునందు పుట్టిన వారమైన మనకు దొరికిన వివరించలేని ధన్యత ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడును అని ప్రకటించిన యెహోవాను మన తండ్రిగా తెలుసుకోవడమే. అయన……
- ఎల్లప్పుడూ ఉనికిలో ఉండేవాడు
- వ్యక్తిత్వం మరియు శక్తి విషయంలో తనకు మాత్రమే స్వంతమైనవాడు
- మారనివాడు
- ఆయన ద్వారా విశ్వంలో సమస్తమైన శక్తి మరియు అధికారం ప్రవహింపజేయువాడు
- సర్వ సృష్టిలోని జీవరాశులన్నిటిని జీవింపజేసేవాడు
యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు, కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు (కీర్తన 9:10).
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web