“జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు…. కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.” (1 పేతురు 3:10-11)
నిజమైన స్వాతంత్ర్యం అంటే ఏమిటి? మీరు స్వాతంత్ర్యాన్ని పొందారా?
మనం సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందాలనుకుంటే ఇక్కడ చెప్పబడిన నాలుగు విషయాలు నిజం కావాల్సిన అవసరత ఉంది.
1) మీకు ఒక పని చేయాలనే కోరిక లేకపోతే, మీరు దానిని చేయడానికి మీకు సంపూర్ణ స్వాతంత్ర్యం పొందలేదని అర్థం. ఆ పనిని మీరు చేయడానికి మీ సంకల్ప శక్తినంత కూడగట్టుకొనినప్పటికీ, దానిని ఎవరూ సంపూర్ణ స్వాతంత్ర్యం అని అనరు. ఈ విధంగా మనం జీవించాలని అనుకోము. మనకు అవసరంలేని ఒత్తిడి మరియు ఆటంకము మన మీద ఉంటుంది.
2) మీకు ఏదైనా చేయాలనే కోరిక కలిగియుండి, దానిని చేయగల సామర్థ్యం లేకపోతే, మీరు దానిని చేయడానికి స్వాతంత్ర్యం పొందలేదు.
3) మీకు ఏదైనా చేయాలనే కోరికను కలిగి, సామర్థ్యం కలిగి, దానిని చేయడానికి అవకాశం లేకపోతే, మీరు దానిని చేయడానికి స్వాతంత్ర్యాన్ని పొందలేదు.
4) మీకు ఏదైనా చేయాలనే కోరిక కలిగి, దానిని చేయగల సామర్థ్యాన్ని అవకాశాన్ని కలిగి ఉండి, అది చివర్లో మిమ్మల్ని నాశనం చేసినట్లయితే, మీరు దానిని చేసినప్పుడు మీరు పూర్తిగా స్వాతంత్యాన్ని పొందలేదు, అంటే దానిని మీరు చేయడానికి వాస్తవానికి స్వాతంత్ర్యాన్ని పొందలేదని అర్థం.
పూర్తి స్వాతంత్ర్యాన్ని పొందుకోవాలంటే, మనల్ని శాశ్వతంగా సంతోష పెట్టేటువంటి పనిని చేయడానికి మనం తప్పనిసరిగా ఆశను, సామర్థ్యాన్ని, అవకాశాన్ని కలిగి ఉండాలి. ఎటువంటి బాధలు ఉండకూడదు. మన కోస౦ చనిపోయి, తిరిగి లేచిన దేవుని కుమారుడైన యేసు మాత్రమే దానిని సుసాధ్యం చేయగలడు.
కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులైయుందురు (యోహాను 8:36).