“ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి, ఆకాశము క్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును”. (లూకా 17:24)
చికాగో నుంచి మిన్నియాపోలిస్ ప్రాంతానికి రాత్రివేళ ఎక్కువ జనంలేని ఒక విమానంలో ప్రయాణిస్తున్నాను. మిచిగాన్ సరస్సుపై, విస్కాన్సిన్ లో ఉరుములతో కూడిన వర్షం కురిసిందని పైలట్ ప్రకటించారు. స్వల్ప అల్లకల్లోలాన్ని నివారించడానికి అతను విమానాన్ని పడమర దిక్కు వైపు తిప్పుతాను అని చెప్పాడు.
విమానం తూర్పు వైపున ఉన్న దట్టమైన నల్లటి మేఘాలను చూస్తూ కూర్చున్నప్పుడు, అకస్మాత్తుగా ఆకాశం మొత్తం కాంతితో ప్రకాశవంతంగా మారింది, విమానం నుండి నాలుగు మైళ్ళ దూరంలో తెల్లని మేఘాల గవిలాంటిది విమానం క్రింద పడి అదృశ్యమైంది.
ఒక్క క్షణం తర్వాత, ఒక భారీ తెల్లని కాంతి సొరంగం ఆకాశ ఉత్తరం వైపు నుండి దక్షిణానికి పేలి, మళ్ళీ ఆ నల్లటి దట్టమైన మేఘాలలో మాయమైంది. కొద్దిసేపటికే మెరుపులు ఆగిపోకుండా తదేకంగా వస్తూనే ఉన్నాయి, మేఘాల లోయలో నుండి వెలుగు అగ్నిపర్వతంవలె విరజిమ్మింది మరియు కొంత దూరంలో తెల్లని మేఘాల కొండలు పైకి లేచాయి.
నేను నా తలను ఊపుతూ, నమ్మలేని స్థితిలో కూర్చుండిపోయాను. ఓ ప్రభువా, ఇవి నీ ఖడ్గానికి పదును పెట్టడంవల్ల వచ్చే నిప్పురవ్వలు మాత్రమే అయితే, నీవు ప్రత్యక్షమయ్యే రోజు ఎలా ఉంటుందో! అప్పుడు నేను క్రీస్తు మాటలను జ్ఞాపకం చేసుకున్నాను: “ఆకాశము క్రింద ఒక దిక్కునుండి మెరుపు మెరిసి, ఆకాశము క్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్యకుమారుడు తన దినమున ఉండును” (లూకా 17:24).
ఇప్పుడు కూడా ఆ దృశ్యం గుర్తుకువస్తున్నకొద్దీ మహిమ అనే పదం నాలో భావోద్వేగంతో నిండి ఉంది. ఆయనను కోరుకోవడానికి, ఆయనను చూడటానికి, క్రైస్తవ విందుకు కూర్చొని మహిమగల రాజును ఆరాధించడానికి ఆయన నా హృదయాన్ని మేల్కొల్పినందుకు నేను దేవునికి పదేపదే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విందు శాల చాలా పెద్దది. రండి.