“యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను”. (కీర్తన 27:4)

ఆత్మ యొక్క తీవ్ర వాంఛపట్ల దేవుడు స్పందించకుండ ఉండేవాడు కాదు. ఆయన వచ్చి పాప భారాన్ని ఎత్తివేసి, మన హృదయాన్ని సంతోషంతోను, కృతజ్ఞతతోను నింపాడు. “నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. (కీర్తన 30:11-12)

అయితే గడచిన వాటిని మాత్రమే కృతజ్ఞతా భావముతో తలుంచుకుంటే మన ఆనందం ఎక్కువ కాదు గానీ భవిష్యత్తునందున్న నిరీక్షణలో నమ్మిక ఉంచుట వలన కూడా ఎక్కువవుతుంది: “నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో క్రుంగియున్నది కావున యొర్దాను ప్రదేశమునుండియు హెర్మోను పర్వతమునుండియు మిసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను.” (కీర్తన 42:5-6)

“యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను” (కీర్తన 130:5).

చివరికి, హృదయ౦ దేవుని మ౦చి బహుమానాల కోస౦ పరితపించదు గాని దేవుని కోస౦ పరితపిస్తుంది. ఆయనను చూడటం, ఆయనను తెలుసుకోవడం, ఆయన సన్నిధిలో ఉండటం అనేది ఆత్మకు అంతిమ విందు. దీనికి అతీతమైన దాహమనేదే (ఆకాంక్ష) ఉండదు. మాటలు విఫలమవుతాయి. వాస్తవానికి మనం దానిని సుఖం, ఆనందం, సంతోషం అని పిలుస్తాం గానీ ఈ పదాలన్నీ అంతులేని అనుభవానికి సరిపోయేవి కావు:

“యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను” (కీర్తన 27:4).

“జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు” (కీర్తన 16:11).

“యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును” (కీర్తన 37:4). 

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *