“యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము”. (కీర్తన 25:11)
ఏది సరైనదో తెలుసుకోవడానికి, దేవుడు తన కంటే ఉన్నతమైన ఏ అధికారాన్ని సంప్రదించడు. విశ్వంలో ఆయన స్వంత యోగ్యత అంతిమ విలువైనది. కాబట్టి, దేవుడు సరైనది చేయడం అంటే ఈ అంతిమ విలువకు అనుగుణంగా ప్రవర్తించడం.
దేవుని నీతి అనేది ఆయన స్వంత పరిపూర్ణత మరియు యోగ్యత అనే అత్యంత విలువైన దానిలో ఆయన కలిగి ఉన్న అనంతమైన ఉత్సాహం ఆనందం మరియు ప్రీతి. ఆయన ఎప్పుడైనా తన పరిపూర్ణతల కోసం ఈ శాశ్వతమైన అభిరుచికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, ఆయన అవినీతిపరుడు అవుతాడు – అలాగే ఆయన విగ్రహారాధకుడు అవుతాడు.
అటువంటి నీతిమంతుడైన దేవుడు తన పరిపూర్ణతలను తృణీకరించిన మనలాంటి పాపులపై తన ప్రేమను ఎలా చూపుతాడు? కానీ సువార్త యొక్క అద్భుతం ఏమిటంటే, ఆయన దైవిక నీతిలో మన రక్షణకు పునాది ఉంది.
కుమారుని పట్ల తండ్రికి ఉన్న అనంతమైన గౌరవం, ఘోర పాపి అయిన నన్ను కుమారుడైన క్రీస్తుని బట్టి ప్రేమించడం మరియు అంగీకరించడం సాధ్యమవుతుంది, ఎందుకంటే క్రీస్తు మరణం ద్వారా ఆయన తన తండ్రి విలువను మరియు కీర్తిని నిరూపించాడు.
క్రీస్తు కారణంగా, కీర్తనాకారుని యొక్క ప్రార్థనను మనం కొత్త అవగాహనతో ప్రార్థించవచ్చు, “ప్రభువా, నీ నామము నిమిత్తము, నా అపరాధమును క్షమించుము, ఎందుకంటే అది బహు ఘోరమైనది” (కీర్తన 25:11). క్రొత్త అవగాహన ఏమిటంటే, క్రీస్తు కారణంగా, “నీ పేరు కోసం, నా అపరాధాన్ని క్షమించు” అని మాత్రమే ప్రార్థించే బదులు, “యేసు నామం కోసం, దేవా, నా అపరాధాన్ని క్షమించు” అని ప్రార్థిస్తున్నాము.
1 యోహాను 2:12, “చిన్న పిల్లలారా, ఆయన నామముబట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను.” అని యేసును ప్రస్తావిస్తూ చెప్పుచున్నది. యేసు ఇప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తం చేసాడు మరియు మన “ఆయన నామముబట్టి మీ పాపములు క్షమింపబడునట్లు” తండ్రి ఘనతను నిరూపించుకున్నాడు. దేవుడు నీతిమంతుడు. ఆయన పాపంను రగ్గు కిందకు తుడుచేయడు. ఒక పాపి విడుదల పొందితే, ఆ పాపి పరువు తీసిన దేవుని మహిమ యొక్క అనంతమైన విలువను నిరూపించడానికి ఎవరైనా చనిపోతారు. క్రీస్తు చేసినది అదే. కాబట్టి, “ప్రభువా, నీ నామము కొరకు” మరియు “యేసు నామము కొరకు” అనేవి ఒకటే. అందుకే మనం క్షమాపణ కోసం విశ్వాసంతో ప్రార్థిస్తాము.