“అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును”. (1 కొరింథీ 15:24)
క్రీస్తు పాలన ఎంత వరకు విస్తరించింది?
తదుపరి వచనం, 1 కొరింథీయులు 15:25 ఇలా చెబుతోంది, “తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను” ఈ వాక్యంలో అందరిని అనే మాట పరిధిని గురించి తెలియజేస్తుంది.
అలాగే 24వ వచనంలోని సమస్త అనే మాట కూడ ఇదే తెలియజేస్తుంది: “అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.”
క్రీస్తు గౌరవానికి భంగం కలిగించే శత్రువులందరినీ ఆయన అధిగమిస్తాడు. ఆయన అధిగమించలేని వ్యాధి లేదు, వ్యసనం లేదు, దెయ్యం లేదు, చెడు అలవాటు లేదు, తప్పు లేదు, దుర్మార్గం లేదు, బలహీనత లేదు, కోపము లేదు, మూర్ఖత్వం లేదు, గర్వం లేదు, ఆత్మాభిమానం లేదు, కలహాలు లేవు, అసూయ లేదు, వక్రబుద్ధి లేదు, దురాశ లేదు, సోమరితనం లేదు.
మరియు ఆ వాగ్దానంలోని ప్రోత్సాహం ఏమిటంటే, మీ విశ్వాసముకు మరియు మీ పవిత్రతకు శత్రువులయిన వారితో మీరు యుద్ధం చేయడానికి సిద్ధపడినప్పుడు, మీరు ఒంటరిగా పోరాడరు.
యేసుక్రీస్తు ఇప్పుడు, ఈ యుగంలో, తన శత్రువులందరినీ తన పాదాల క్రింద ఉంచుతున్నాడు. ప్రతి రాజ్యము, ప్రతి అధికారం మరియు ప్రతి బలము జయించబడతాయి.కాబట్టి, మీ జీవితంలో మరియు ఈ విశ్వంలో ఆయన కీర్తికి వ్యతిరేకంగా ఉన్న అతి చిన్న మరియు అతిపెద్ద శత్రువుకు క్రీస్తు పాలన పరిధి విస్తరించిందని గుర్తుంచుకోండి. అది ఓడిపోతుంది.