“నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అప వాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి”. (1 పేతురు 5:8-9)
మన ఆత్మలకు (అంతరంగాలకు) ఉన్న రెండు ప్రధాన శత్రువులు ఏంటంటే పాపం మరియు సాతాను. పాపం అత్యంత ఘోరమైన శత్రువు, ఎ౦దుక౦టే సాతాను మనల్ని నాశన౦ చేయగల ఏకైక మార్గ౦ మనల్ని పాపానికి గురిచేయడ౦, మనల్ని పశ్చాత్తాపపడకుండా చేయడ౦. మనల్ని బాధపెట్టేది క్షమించబడని పాపం మాత్రమే గాని సాతాను కాదు.
దేవుడు స్ముర్నలో పరిశుద్ధులకు చేసినట్లే (ప్రకటన 2:10) మనల్ని చంపడానికి అప్పగించవచ్చు, లేదా ఆయన యోబుకు చేసినట్లే మనల్ని హింసించవచ్చు; కానీ సాతాను మనల్ని శిక్షించలేడు లేదా నిత్యజీవం నుండి మనల్ని దొంగలించలేడు. వాడు మనకు చేయగలిగిందల్లా ఏంటంటే మనం పాపం చేసేవిధంగా మనల్ని ప్రభావితం చేయడం మరియు మనం చేసిన పాపానికి పశ్చాత్తాప పడకుండ చేయడం. ఇదే వాడి అసలైన లక్ష్యం.
కాబట్టి, సాతాను యొక్క ప్రధాన పని, మన పాపాన్ని సమర్థించడం, ప్రోత్సహించడం, సహాయపడటం, రెచ్చగొట్టడం మరియు ధృవీకరించడం, అలాగే మనల్ని విశ్వాసం నుండి, పశ్చాత్తాపం చెందుట నుండి దూరంగా ఉంచడం.
ఈ విషయాన్ని మనం ఎఫెసీ 2:1-2 వచనాలలో చూస్తాం: “మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను. మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.” పాపము చేయుట అనేది లోకములోని సాతాను అధికారముతో “ఏకీభవీస్తోంది.” వాడు నైతిక చెడు గురించి తీసుకు వచ్చినప్పుడు, అది పాపము ద్వారానే తీసుకు వస్తాడు. మనం పాపం చేసినప్పుడు, వాని ప్రాంతంలోనికి నడుస్తాం. మనం వానితో ఏకీభవిస్తాం. మనం పాపము చేసినప్పుడు, దయ్యానికి స్థానం కల్పిస్తాం (ఎఫెసీ 4:27).
తీర్పు రోజున మనల్ని శిక్షించేది అనారోగ్య౦ లేదా బాధలు, హి౦సలు, భయాలు లేదా పీడకలలు కాదు గాని క్షమించరాని పాప౦ మాత్రమే. ఈ విషయం సాతానుకు తెలుసు కాబట్టి, వింత పోకడలతో క్రైస్తవులను ఎలా భయపెట్టాలన్నది వాని ప్రధాన లక్ష్యం కాదు (అది పుష్కలంగా ఉన్నప్పటికీ) గానీ పనికిరాని చెడు ఆలోచనలతో క్రైస్తవులను ఎలా భ్రష్టుపట్టించాలన్నదే వాని ప్రధాన లక్ష్యం.
మన విశ్వాస౦ స్థిరంగా లేని సమయ౦లో, అది బలహీన౦గా ఉన్నప్పుడు సాతాను మనల్ని పట్టుకోవాలనుకుంటాడు. సాతాను చేసే ప్రయత్నాలను ఎదుర్కునే మన సాధనాలను వాడు నాశనం చేయదలచుకున్నాడని కూడా అర్థమవుతో౦ది. అందుకే పేతురు, “లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి” (1 పేతురు 5:9) అని చెప్తున్నాడు. అ౦దుకే పౌలు “విశ్వాసమను డాలు” “దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుతుందని” (ఎఫెసీ 6:16) చెబుతున్నాడు.
సాతాను నాశనము చేయదలచిన మీ విశ్వాసాన్ని బలపరచుకోవడమే సాతానుని ఎదిరించడానికి (ఓడించడానికి) మార్గం.



