“నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునైయున్నాడు”. (కీర్తన 73:26)
ఈ వచనంలో అక్షరార్థంగా క్రియా పదం “క్షీణించిపోవడం” అని చెప్పబడింది గాని “”క్షీణించిపోయినను” కాదు. దేవుని దయను పొందిన ఈ కీర్తనాకారుడు ఆసాపు గారు, “నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను” అని చెప్తున్నాడు! నేను ధైర్యం చెడిన వ్యక్తిని! నేను నిరాశ చెందాను! అయితే, తాను నిరాశ చెందిన దానికి విరుద్ధంగా వెనువెంటనే, “దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునైయున్నాడు” అని ఒక విశాలమైన కోణాన్ని చెప్తున్నాడు.
కీర్తనాకారుడు నిరుత్సాహానికి లొంగిపోలేదు గాని ఆయన అవిశ్వాసంపై ఎదురుదాడితో పోరాటం చేస్తున్నాడు.
“నాలో నేను చాలా బలహీన౦గా, నిస్సహాయ౦గా ఉన్నాను, తట్టుకోలేకపోతున్నాను. నా శరీరం కాల్చివేయబడింది, నా హృదయం దాదాపు చనిపోయింది. కానీ ఈ నిరుత్సాహానికి కారణం ఏదైతేనేం, నేను లొంగను. నేను దేవుణ్ణి నమ్ముతాను గాని నన్ను నేను నమ్ముకోను. ఆయనే నా బలం, ఆయనే నా ఆశ్రయదుర్గం” అని కీర్తనాకారుడు చెప్తున్నాడు.
నిరాశ నిస్పృహలకు గురైన అంతరంగాలతో పోరాడుతున్న పరిశుద్ధుల ఉదంతాలతో బైబిల్ నిండి ఉంది. “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును” అని కీర్తన 19:7వ వచనం చెప్తోంది. పరిశుద్ధుని ప్రాణము (అంతరంగం) కొన్నిసార్లు పునరుజ్జీవింపజేయబడవలసిన అవసరం ఉందని ఈ మాట స్పష్టంగా ఒప్పుకుంటోంది. అది పునరుజ్జీవింపబడవలసిన అవసరత ఉన్నట్లయితే, ఒక రకంగా “చనిపోయిందని” అర్థం. అది ఆ విధంగా అనిపించింది.
ఇదే విషయాన్ని దావీదు కూడా కీర్తన 23:2-3లో చెబుతున్నాడు, “శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు…” “యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగలయొకని” (1 సమూయేలు 13:14) పునరుద్ధరించవలసి వచ్చింది. అది దాహంతో చనిపోయి అలసిపోవడానికి సిద్ధంగా ఉంది, కాని దేవుడు ప్రాణాన్ని (అంతరంగాన్ని) నీటి వద్దకు తీసుకువెళ్ళి దానికి తిరిగి జీవం ఇచ్చాడు.
దేవుడు ఈ సాక్ష్యాలను బైబిలులో ఉంచాడు, తద్వారా నిరాశ నిస్పృహలతో నిండిన అవిశ్వాసంతో పోరాడటానికి వాటిని ఉపయోగించవచ్చు. “దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునైయున్నాడు” అనే దేవుని వాగ్దానాలపై విశ్వాసముతో మనం పోరాడుతున్నాం. ఆ విషయాన్ని మనకు మనమే బోధించుకుంటాం. మనం దానిని సాతాను ముఖంపై కొట్టి, దానిని నమ్ముతాం.



