సేవ చేయడానికి మిమ్మల్ని ఏది నడిపిస్తుంది? 

షేర్ చెయ్యండి:

“ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును”. (గలతీ 6:8)

సాధ్యమైనంతవరకు దేవుని కృపను అనుభవించుటకు విశ్వాసం తీరని ఆకలిని కలిగి ఉంటుంది. కాబట్టి, దేవుని కృప అత్యంత స్వేచ్చగా ప్రవహించే నది వైపుకు, అంటే ప్రేమ నది ప్రవాహం వైపుకు విశ్వాసం పయనిస్తుంది.

ప్రేమకు అవసరమైన అసౌకర్యాలను, శ్రమను మనమే వహించడానికి మనకు తృప్తినిచ్చే గదుల నుండి బయటకు రావడానికి మనల్ని కదిలించేది ఏమిటి?

ఏది మనల్ని ముందుకు నడిపిస్తుంది…..

  • మనకు సిగ్గుగా అనిపించినప్పుడు అపరచితులను పలకరించడమా?
  • మనకు కోపం వచ్చినప్పుడు శతృవు దగ్గరకు వెళ్లి సమాధానపడమని వేడుకోవడమా?
  • మనం ఎప్పుడూ ప్రయత్నించనప్పుడు దశమ భాగం ఇవ్వడమా?
  • మన౦ పిరికివాళ్ల౦గా ఉన్నప్పుడు క్రీస్తు గురి౦చి మన సహోద్యోగులతో మాట్లాడడమా?
  • బైబిలు అధ్యయనానికి ఇరుగు పొరుగువారిని ఆహ్వానించడమా?
  • సువార్త కొరకై విభిన్న సంస్కృతులను ఎదుర్కోవడమా?
  • తాగుబోతుల కోసం క్రొత్త సేవను ప్రారంభించడమా?
  • వ్యాన్ నడుపుతూ సాయంత్రం గడపడమా?
  • పునరుద్ధరణ కోసం ప్రార్థించేందుకు ఒక ఉదయాన్ని వెచ్చించడమా?

ఎంతో వెలతో కూడిన ఈ ప్రేమ కార్యాలన్నీ ఊరకనే జరగవు. అవి దేవుని కృపను సంపూర్ణంగా అనుభవించడం కోసం విశ్వాసపు ఆకలి అనే క్రొత్త ఆకలి ద్వారా వాటన్నిటిని చేయాలనే ప్రేరణకు గురిచేస్తాయి. మనకు దేవుడు ఎక్కువగా కావాలి. మనం కోరుకునే వ్యక్తిగత, అంతరాయంలేని భద్రత మరియు సౌకర్యం అనేవాటికంటే వీటిని మనం ఎక్కువగా కోరుకోవాలి.

విశ్వాసం దేవుని మీద ఆధారపడటాన్ని ఆయన మనలో అద్భుతమైన కార్యాలను జరిగించుటను చూసేందుకు ఇష్టపడుతుంది. అందుచేత, దేవుని భవిష్యత్తు కృపకు సంబంధించిన శక్తి అత్యంత స్వేచ్చగా ప్రవహించే చోటకి, ప్రేమ ప్రవాహమున్న చోటకి విశ్వాసం మనల్ని నడిపిస్తుంది.

మనం ఆత్మను బట్టి విత్తాలని (గలతీ 6:8) పౌలు చెప్పినప్పుడు, ఆయన ఈ అర్థాన్నే చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఆత్మ దేవుడు ఫలాల్ని ఇవ్వడానికి పని చేస్తున్నాడని మనకు తెలిసిన సాళ్ళల్లో, అంటే ప్రేమ సాళ్ళల్లో మన శక్తి యొక్క విత్తనాలను విశ్వాసం ద్వారానే మనం విత్తాలి. 

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...