“ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను”. (1 పేతురు 2:23) 

యేసు కంటే ఎవరు కూడా ఘోరమైన పాపానికి గురియైయుండరు. ఆయనపై పెట్టుకున్న ద్వేషమంతా పూర్తిగా అనర్హమైనది.

యేసుకంటే మరే ఒక్కరు గౌరవానికి అర్హులుగా జీవించలేదు; ఎవరూ అంత ఎక్కువ అవమానాన్ని పొందలేదు.

కోపగించుటకు, పగను  ప్రతీకారాన్ని తీర్చుకునే హక్కు ఎవరికైనా ఉంటుందంటే అది యేసుకే ఉంటుంది. ఆయన ఎవరి ఉనికినైతే కాపాడుతున్నాడో ఆ దుర్మార్గులు తన ముఖంపై ఉమ్మివేసినప్పుడు ఆయన తనను తాను ఎలా నియంత్రించుకున్నాడు? “ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను” అని మొదటి పేతురు 2:23వ వచనం సమాధానమిస్తోంది.

ఈ వచనానికి అర్థమేంటంటే, దేవుని నీతియుక్తమైన తీర్పు యొక్క భవిష్యత్తు కృపపై యేసుకు విశ్వాసముందని అర్థం. ఆయన తన పగను దేవునికి అప్పజెప్పినందున, తాను అనుభవించిన అన్ని అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవలసిన అవసరం లేదు. ఆయన తనకున్న  ప్రతీకారాన్ని దేవుని చేతుల్లో ఉంచి, “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు” (లూకా 23:34) అని తన శత్రువుల కోస౦ ప్రార్థి౦చాడు.

యేసు విశ్వాస౦ గురి౦చి పేతురు మనకు చూపుతున్నాడు, తద్వారా మన౦ ఈ విధ౦గా ఎలా జీవి౦చాలో నేర్చుకు౦టా౦. “మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.” (1 పేతురు 2:20,21).

మంచి తీర్పరియైన దేవుడు పగ తీర్చుకుంటానని వాగ్దానం చేసిన దానిలో క్రీస్తు విశ్వాసముంచి పగను, ప్రతీకారాన్ని జయించినట్లయితే, ఆయనకంటే దురుసుగా ప్రవర్తించినందుకు గొణుగుటకు హక్కు లేదు కాబట్టి, మనమెంత ఎక్కువగా అప్పగించుకోవాలి?

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *