“అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు”. (హెబ్రీయులు 12:14)

ఆచరణాత్మక పవిత్రత అనేది ఒకటుంది, అది లేకుండా మనం ప్రభువును చూడలేము. చాలా మంది ఇది కాదన్నట్లు జీవిస్తున్నారు.

అపవిత్రమైన జీవితాలను గడుపుతూ క్రైస్తవులు అని చెప్పుకునే వారు యేసు యొక్క భయంకరమైన ఈ మాటలను వింటారు, “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును” (మత్తయి 7:23). విశ్వాసులమని చెప్పుకునే వారితో పౌలు ఇలా అన్నాడు, “మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు” (రోమా 8:13).

కాబట్టి, పవిత్రత లేకుండా ఎవరూ దేవుడిని చూడలేరు. మరియు భవిష్యత్ కృపపై విశ్వాసం ఉంచడం ద్వారా పవిత్రత కోసం పోరాడడం నేర్చుకోవడం చాలా ముఖ్యం.

పవిత్రతను వెంబడించడానికి మరొక మార్గం ఉంది, దానివలన ఎదురుదెబ్బ తగిలి మరణం వస్తుంది. బలపరిచే దేవుని కృపపై విశ్వాసం ఉంచడం ద్వారా కాకుండా వేరే మార్గంలో సేవ చేయవద్దని పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు “అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.”(అ.కా 17:25). దేవుని సేవ చేయడానికి చేసే ఏ ప్రయత్నమైనా, మన హృదయాలకు ప్రతిఫలం మరియు మన సేవకు శక్తిగా ఉన్న ఆయనపై ఆధారపడకుండా ఉంటే, ఏదో కొదువైయున్న అన్యమత దేవునికి నిజ దేవుణ్ణి సమానం చేసి ఆయనను అవమానించిన వారమవుతాం.

అటువంటి స్వయం-ఆధారమైన దేవుని సేవకు ప్రత్యామ్నాయాన్ని పేతురు వర్ణించాడు, “ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచ బడును.” (1 పేతురు 4:11). మరియు పౌలు ఇలా అంటున్నాడు, “క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను.” (రోమా ​​15:18; 1 కొరింథీ 15:10 కూడా చూడండి).

దేవుడు మన కోసం నియమించిన “ప్రతి మంచి పనిని” చేయడానికి క్షణ క్షణం మనకు సహాయం చేయడానికి కృప అనుగ్రహించబడుతుంది. “మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.” (2 కొరింథీ 9:8).

మంచి పనుల కోసం పోరాటం అనేది భవిష్యత్ కృప యొక్క వాగ్దానాలను విశ్వసించే పోరాటం.

Author

  • జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

No comments yet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *