“అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయనకృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే”. (1 కొరింథీయులు 15:10)

కృప అనేది మనం పాపం చేసినప్పుడు దేవుడు చూపించే సానుభూతి మాత్రమే కాదు. కృప అనేది పాపం చేయకుండా ఉండేందుకు దేవుడు ఇచ్చిన బహుమతి మరియు శక్తి. కృప అనేది క్షమాపణ మాత్రమే కాదు గాని శక్తి కూడా అని మనం తెలుసుకోవాలి.

ఉదాహరణకు, 1 కొరింథీయులు 15:10 లో ఇది స్పష్టంగా ఉంది. కృపను తన పనిని బలపరిచే శక్తిగా పౌలు వర్ణించాడు. ఇది కేవలం అతని పాపాల గురించిన క్షమాపణ కాదు; విధేయతకు నడిపించే శక్తి. “వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.”

కాబట్టి, దేవునికి విధేయత చూపడానికి చేసే ప్రయత్నం మన స్వంత శక్తితో చేసే ప్రయత్నం కాదు, కానీ “దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది- ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచ బడును” (1 పేతురు 4:11). ఇది విశ్వాసం యొక్క విధేయత. మనం చేయవలసిన పనిని చేయగలిగేలా చేసే దేవుని నుండి ఎప్పటికీ వచ్చే కృపాశక్తిపై విశ్వాసం.

మనం మంచితనంతో చేసిన పనులన్నీ “విశ్వాసయుక్తమైన కార్యము” అని పిలవడం ద్వారా మరియు యేసుకు తెచ్చే మహిమ “దేవునియొక్క కృపచొప్పున” అని చెప్పడం ద్వారా పౌలు దీనిని 2 థెస్స 1:11-12లో ధృవీకరిస్తున్నాడు. ఎందుకంటే  ఆయన “బలముతో” ఇవన్నీ సాధ్యమవుతున్నాయి.  ఆ పదాలన్నింటినీ వినండి:

అందువలన మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తుయొక్కయు కృపచొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు, మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము.

దేవునికి ఆనందాన్ని ఇచ్చే విధేయత విశ్వాసం ద్వారా దేవుని కృపాశక్తి పొందుకున్నది. క్రైస్తవ జీవితంలోని ప్రతి దశలోనూ అదే బలం పని చేస్తోంది. విశ్వాసం ద్వారా రక్షించే దేవుని కృపాశక్తియే (ఎఫెసీ 2:8) విశ్వాసం ద్వారా పవిత్రపరిచే దేవుని కృపాశక్తి.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *