“కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము”. (2 కొరింథీ 5:9)

మీరు (పరిసయ్యులు చేసినట్లు) మీ జీవితాన్ని దేవుణ్ణి సంతోషపెట్టడానికి అంకితం చేశారు, కాని మీరు తరుచుగా దేవుని దృష్టిలో అసహ్యకరమైన పనులు (లూకా 16:14-15) చేస్తూ ఉంటే ఏమి చేయాలి?

ఎవరైనా ఈ విధంగా ప్రశ్నించి, “అది సాధ్యమని నేను అనుకోను; తనను సంతోషపెట్టడానికి ప్రయత్నించే వ్యక్తిని దేవుడు తిరస్కరించడు” అని చెప్పవచ్చు. అయితే ఈ ప్రశ్న అడిగేవారు ఏం చేశారో చూశారా? దేవుడు ఎలా ఉంటాడనే ఆలోచనను ఆధారం చేసుకుని దేవుణ్ణి ఏది సంతోషపెట్టగలదు అనే దాని విషయంలో ఒక దృఢమైన నమ్మకాన్ని కలిగియున్నాడు. అందుకే మనం లేఖనాలలోని బయలు పరిచిన దేవుని స్వభావంతో ప్రారంభించాలి.

దేవుడు ఒక పర్వతపు నీటి ఊట, కానీ నీటి తొట్టి కాదు. ఎందుకంటే పర్వత నీటి ఊట దానికదే పునరుద్ధరణ చెందుతూ ఉంటుంది. ఇది నిరంతరం పొంగిపొర్లుతూ ఇతరులకు సరఫరా చేస్తుంది. కానీ నీటి తొట్టిని పంపుతో లేదా బకెట్‌తో నింపాల్సిన అవసరం ఉంది. కాబట్టి, గొప్ప ప్రశ్న: మీరు నీటి బుగ్గలను ఎలా సేవిస్తారు? మరియు మీరు నీటి తొట్టిని ఎలా సేవిస్తారు? మీరు దేవుణ్ణి నిజంగా ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఎలా మహిమ పరుస్తారు?

మీరు నీటి తొట్టి యొక్క విలువను కీర్తించాలనుకుంటే, దానిని అన్నివేళలా నిండుగా ఉండేలా మరియు ఉపయోగకరంగా ఉంచడానికి మీరు కృషి చేస్తారు. కానీ మీరు నీటి బుగ్గ యొక్క విలువను కీర్తించాలనుకుంటే, మీరు లోయలో నుండి తిరిగి వెళ్లి మీరు కనుగొన్న వాటిని ప్రజలకు చెప్పడానికి మీకు ఉల్లాసం మరియు బలం వచ్చే వరకు మీ చేతులు మరియు మోకాళ్లపై పడుకుని, మీ హృదయం సంతృప్తిచెందే వరకు తాగడం ద్వారా మీరు దీన్ని చేస్తారు.

నిరాశతో ఉన్న పాపిగా నా నిరీక్షణ ఈ బైబిల్ సత్యంపై ఆధారపడి ఉంది: నేను అర్పించే ఒకే ఒక్క దానితో మాత్రమే దేవుడు సంతోషిస్తాడు: అదే నా దాహం. అందుకే దేవుని సార్వభౌమ స్వాతంత్ర్యం మరియు స్వయం సమృద్ధి నాకు చాలా విలువైనవి: దేవుడు బకెట్ నిండా ఉండే వనరుల సమూహం ద్వారా కాదు, విరిగినలిగిన పాపులు దేవుని కృపా ఊట వద్ద తాగడానికి వంగినపుడు దానియందు దేవుడు సంతోషిస్తాడు అనే సత్యం నా నిరీక్షణకు పునాది.

అన్ని విధాలుగా మనం ఇప్పుడు మరియు ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. కానీ మన జీవితమంతా దేవుణ్ణి సంతోషపెట్టడానికి తప్పుడు ఆలోచనలపై ఆధారపడి ఉంటే మనకు శ్రమ. దేవుడు తనను అవసరమైన నీటి తొట్టెగా భావించే వారిచే కాదు, తరగని, అన్నింటిని సంతృప్తిపరిచే నీటి బుగ్గగా భావించే వారిచే సంతోషిస్తాడు. కీర్తన 147:11 చెప్పినట్లు, “తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడై యున్నాడు.”

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *