నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయు

నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయు

షేర్ చెయ్యండి:

“తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను”. (రోమా ​​12:3)

ఈ వచన సందర్భంలో, ప్రజలు తమ గురించి “[వారు] ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా” ఎంచుకుంటున్నారని పౌలు ఆందోళన చెందుతున్నాడు. అంతిమంగా ఈ అహంకారానికి పౌలు చూపించే పరిహారం ఏమిటంటే, ఆత్మ వరాలు దేవుని ఉచిత కృప ద్వారా మనకి ఇచ్చినవి. అంతమాత్రమే కాదు, మనం ఆ వరాలను ఉపయోగించే విశ్వాసం కూడా ఇచ్చాడు “. . . దేవుడు ఒక్కొక్కనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము”.

ఇలా చెప్పడం ద్వారా అతిశయ కారణాలన్నింటినీ మన నుండి తీసివేశారు. వరాలు పొందే అర్హత కూడా వరమే అయితే మనం ఎలా అతిశయిస్తాం?

మనం ఎలా ప్రార్థించాలా అన్న దానిపై ఈ సత్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. లూకా 22:31-32లో యేసు మనకు ఒక ఉదాహరణను ఇచ్చాడు. పేతురు మూడు సార్లు తిరస్కరించడానికి ముందు యేసు అతనితో ఇలా అన్నాడు, “సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.”

యేసును తిరస్కరించి పేతురు పాపం చేసిన తరువాత కూడా పేతురు విశ్వాసం నిలబెట్టుకోవాలని యేసు ప్రార్థించాడు, ఎందుకంటే విశ్వాసం ఇచ్చేది దేవుడని ఆయనకు తెలుసు. కాబట్టి యేసు ప్రార్థించిన విధంగా మన కోసం మరియు ఇతరుల కోసం దేవుడు మన విశ్వాసాన్ని నిలబెట్టాలని మనం ప్రార్థన చేయాలి.

ఆ విధంగా, మూగదయ్యము పట్టినవాని తండ్రి ఇలా బిగ్గరగా  అరిచాడు, “నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని !” (మార్కు 9:24). ఇది మంచి ప్రార్థన. దేవుడు లేకుండా మనం నమ్మవలసిన విధంగా మనం నమ్మలేమనే సత్యాన్ని ఇది అంగీకరిస్తుంది.

మనం రోజూ ఇలా ప్రార్థిద్దాం, “ఓ ప్రభూ, నా విశ్వాసం బట్టి మీకు ధన్యవాదాలు. దానిని నిలబెట్టండి. దాన్ని బలోపేతం చేయండి. దానిని లోతుగా చేయండి. అది విఫలమవ్వకుండా చేయండి. దానిని నా జీవితానికి ఒక బలంగా మార్చండి, తద్వారా నేను చేసే ప్రతి పనిలో మీరు గొప్ప దాతగా మహిమను పొందుతారు. ఆమెన్.”

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...