“దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి”. (2 కొరింథీ 1:20)

“దేవుని వాగ్దానములు ఎన్నియైనను న్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉంటే,” ఇప్పుడు వర్తమానము కొరకు ఆయనను విశ్వసించడం అంటే ఆయన వాగ్దానాలు నెరవేరుతాయని విశ్వసించడం.

ఆయనను విశ్వసించడం మరియు ఆయన వాగ్దానాలను విశ్వసించడం అనేవి రెండు వేర్వేరు విశ్వాసాలు కాదు. యేసును నమ్మడం – రక్షణ కోసం యేసును విశ్వసించడం – అంటే ఆయన తన మాటను నిలబెట్టుకుంటాడని నమ్మడం. సిలువ వేయబడిన మరియు పునరుత్థానుడైన యేసులో తృప్తి చెందడం అంటే భవిష్యత్తులోని ప్రతి క్షణంలో, శాశ్వతత్వం వరకు, ఏదీ మనలను ఆయన ప్రేమ నుండి వేరు చేయదు లేదా సమస్తము సమకూర్చి మనకు మంచి చేయకుండా ఆయనను ఎవరు ఆపలేరు అనే విశ్వాసాన్ని కలిగి ఉండటం. మరియు ఆ “మంచి” ఏంటంటే క్రీస్తులో దేవుడు ఎంత అందమైనవాడో మరియు ఎంత విలువైనవాడో చూస్తూ, ఆస్వాదిస్తూ ఇదే నా అమూల్యమైన ఐశ్వర్యమని బావించడం.

ఈ సర్వ-సంతృప్తికరమైన మేలు మనకు ఎప్పటికీ ఉంటుందనే విశ్వాసం గతంలోని మహిమాన్వితమైన కృపపై ఆధారపడి ఉంటుంది, ప్రత్యేకించి దేవుడు తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు (రోమా 8:32).

దేవుని గత విజయాలన్నింటిలో – ముఖ్యంగా మన పాపాల కోసం క్రీస్తు మరణ పునరుత్థానముల యందు – మరియు ఆయన వాగ్దానాలన్నింటిలో మనం ఇప్పుడు ఆయన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని రుచి చూడాలి. ఈ గత కృపను ఆధారం చేసుకొని, దేవుడు తరువాతి క్షణంలో, మరియు వచ్చే నెలలో మరియు అనంతమైన శాశ్వతమైన యుగాలలో మనకు ఏమై ఉన్నాడో దానంతటిపై మన నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని ఉంచడం.

ఆయనే మరియు ఆయన మాత్రమే భవిష్యత్తులో మనలను సంతృప్తి పరుస్తాడు. క్రీస్తు మనల్ని జీవించమని పిలిచిన తీవ్రమైన క్రైస్తవ జీవితాలను మనం ఇక్కడ ఇప్పుడు జీవించాలంటే, ఈ భవిష్యత్తు గురించి మనకి నిశ్చయత ఉండాలి.

ఇప్పుడు క్రీస్తును ఆస్వాదించడం – మన ప్రస్తుత విశ్వాసం – దేవుని వాగ్దానాలన్నీ అవును అనే విశ్వాసం కలిగి ఉండకపోతే, అది దేవుడు (భవిష్యత్తులో ప్రతి క్షణం) అందించే తీవ్రమైన సేవ చేసే శక్తిని స్వీకరించలేము (1 పేతురు 4 :11).

నా ప్రార్థన ఏమిటంటే, భవిష్యత్ కృపపై ఉండే విశ్వాసం గూర్చి ఇలా ఆలోచించడం ద్వారా దేవుని వాగ్దానాలను విశ్వసించడం గురించిన మిడిమిడి, అతి సరళీకృత మాటలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది లోతైన మరియు అద్భుతమైన విషయం.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *