“విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి”. (1 కొరింథీ 6:20)

ఉద్దేశపూర్వకంగా హృదయంతో, మనస్సుతో మరియు శరీరంతో దేవుని అనంతమైన విలువను చాటిచెప్పే అన్ని చర్యలను కలిపి “ఆరాధన” అంటాము. దీని కొరకు మనం సృష్టించబడ్డాము. ఉదాహరణకు సంఘంలో పాడడం అలాగే వంటగదిని తుడవడం కూడా ఆరాధనే.

మీరు ఆరాధన గురించి ఆలోచించినప్పుడు ఆదివారం జరిగే ఆరాధన గురించి మాత్రమే ఆలోచించవద్దు. బైబిల్లో ఆరాధనకు అటువంటి పరిమితులు లేవు. జీవితమంతా ఆరాధనగా ఉండితీరాలి.

ఉదాహరణకు అల్పాహారం లేదా మధ్యాహ్న స్నాక్స్ తీసుకోండి. 1 కొరింథీ 10:31 ఇలా చెబుతోంది, “కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.” తినడం త్రాగడం అనేవి చాలా సాధారణమైనవి. తినడం త్రాగడం కంటే మరింత వాస్తవమైనవి లేదా సాధారణమైనవి ఏమున్నాయి?  పౌలు, మీరు తినడం త్రాగడం అంతా దేవునికి ఆరాధనగా ఉండాలని చెప్తున్నాడు.

లేదా సెక్స్ తీసుకోండి. జారత్వమునకు ప్రత్యామ్నాయం ఆరాధన అని పౌలు చెప్తున్నాడు.

జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. (1 కొరింథీ 6:18-20)

అంటే, మీ లైంగికత ద్వారా మీ శరీరంతో దేవున్ని ఆరాధించండి అని పౌలు అంటున్నాడు.

లేదా చివరి ఉదాహరణగా మరణాన్ని తీసుకోండి. మన శరీరంలో మరణాన్ని అనుభవిస్తాం. నిజానికి, ఇది ఈ భూమిపై శరీరం యొక్క చివరి కార్యం అవుతుంది. శరీరం వీడ్కోలు పలుకుతుంది. శరీరం యొక్క ఆ చివరి చర్య ద్వారా మనం ఎలా ఆరాధించాలి? ఫిలిప్పీ 1:20-21లో ఈ ప్రశ్నకు సమాధానం చూస్తాము. మరణం ద్వారా క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని అంటే ఆరాధించబడటం, యోగ్యుడిగా చూపించబడటం తన అపేక్ష అని పౌలు చెప్పాడు. అప్పుడు అతను “నామట్టుకైతే… చావైతే లాభము.” అని అంటున్నాడు. మరణాన్ని లాభంగా పరిగణించడం ద్వారా మరణించడంలో క్రీస్తు అనంతమైన విలువను మనం వ్యక్తపరుస్తాము.

మీకు శరీరం ఉంది. కానీ అది మీది కాదు. “మీరు వెలపెట్టి కొనబడినవారు. కావున మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి.”

నువ్వు ఎప్పుడూ దేవాలయములోనే ఉంటావు. ఎల్లప్పుడూ ఆరాధిస్తూనే ఉంటావు.

Author

  • జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *