“మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు”. (ఎఫెసీ 2:8-9)
కృప మాత్రమే సాధించదగ్గ కార్యంలో మనం అతిశయించకుండ చూసుకోవాలని, క్రొత్త నిబంధన విశ్వాసానికి మరియు కృపకు మధ్యన పరస్పర సంబంధం ఉందని చెప్తోంది.
ఒకానొక సుపరిచితమైన ఉదాహరణలలో ఎఫెసీ 2:8వ వచనం కూడా ఒకటి. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నాం. కృప యొక్క స్వేచ్ఛను కాపాడే పరస్పర సంబంధం ఉంది. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నాం.
విశ్వాసం అంటే మన స్వంత అసమర్థత నుండి మరలి, దేవుని యొక్క స్వేచ్ఛాపరమైన, దేవుని సర్వ సమృద్ధిగల వనరుల వైపుకు వెళ్ళే మన ఆత్మ యొక్క చర్య. అనర్హులకు కృపను అనుగ్రహించేందుకు దేవుని స్వాతంత్ర్యం మీద విశ్వాసం దృష్టి పెడుతుంది. అది దేవుని దాతృత్వం మీద ఆధారపడి ఉంటుంది.
అందుచేత, విశ్వాసం అనేది దానికున్న స్వభావరీత్యా అతిశయింపజేయకుండా కృపతో ఇమిడిపోతుంది. ఎక్కడ చూసినా, ప్రతి ప్రశంసనీయమైన చర్య వెనుక ఉన్నటువంటి కృపను విశ్వాసం చూడగలుగుతుంది. కాబట్టి అది కృపకు కర్తయైన ప్రభువులో తప్ప మరి దేనిలోనూ అతిశయించదు.
అందుచేత, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నామని పౌలు చెప్పిన తరువాత, “ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు” (ఎఫెసీ 2:8-9). విశ్వాసం అనేది మానవ మంచితనంలోను, సామర్థ్యంలోను, జ్ఞానంలోను అతిశయించదు. ఎందుకంటే, విశ్వాసం అనేది సర్వమును అనుగ్రహించే దేవుని కృప మీదనే దృష్టి పెడుతుంది. ఎటువంటి మంచితనాన్ని విశ్వాసం చూసినప్పటికీ, దానిని అది కృపా ఫలంగానే చూస్తుంది.
మనకు కలిగిన “దేవుని జ్ఞానాన్ని, నీతిని, పవిత్రీకరణను, విమోచనను” విశ్వాసం చూసినప్పుడు, “అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను” అని అది సమాధానం చెబుతుంది (1 కొరింథీ 1:30-31).