ప్రామాణికమైన విశ్వాసం మరియు నకిలీ విశ్వాసం
ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్క సారే అర్పింపబడి, తన కొరకు కనిపెట్టుకొనియుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండ రెండవసారి ప్రత్యక్షమగును. (హెబ్రీ 9:28)
మనందరి ముందున్న ప్రశ్న ఏంటంటే క్రీస్తు “అనేకుల” పాపాలను భరించాడు, ఆ “అనేకులలో” మనము కూడా ఉన్నామా? ఆయన రెండవ రాకడలో మనం రక్షించబడతామా?
హెబ్రీ 9:28 వచనం ఇచ్చే జవాబు ఏంటంటే “ఆయన కోసం మనం కనిపెట్టుకొని” ఉన్నట్లయితే అనేకులలో మనం కూడా ఉన్నాం. ఆయన రెండవ రాకడ కోసం మనం ఆతృతగా ఎదురుచూసేటువంటి విధానంలో మనం క్రీస్తును నమ్మినట్లయితే మన పాపాలు తీసివేయబడ్డాయని, అవి తీర్పు దినమున పరిగణించబడవని మనం తెలుసుకోవచ్చు.
క్రీస్తును నమ్ముతున్నామని చెప్పుకునే నకిలీ విశ్వాసము ఉంది గాని అది కేవలం ఫైర్ ఇన్సురెన్స్ పాలసి మాత్రమే. నకిలీ విశ్వాసం నరకాన్ని తప్పించుకోవడాన్ని మాత్రమే “నమ్ముతుంది.” ఈ విశ్వాసం కీస్తు కోసం నిజమైన ఆశను కలిగి ఉండదు. వాస్తవానికి, ఒకవేళ ఆయన రెండవసారి రాకపోతే చాలా బాగుంటుంది, ఈ లోక సుఖాలను మనం బాగా అనుభవించవచ్చునని అనుకుంటుంది. అంటే, ఇలాంటి విశ్వాసానికి మనస్సంతా క్రీస్తుతో కాకుండా లోకంతో ఉందని మనకు తెలియజేస్తోంది.
అందుచేత, మనకున్న సమస్య ఏంటంటే, క్రీస్తు రాకడ కోసం మనం ఆతృతగా ఎదురుచూస్తున్నామా? లేక ఈ లోకంతో మనకున్న సంబంధాన్ని కొనసాగించడం కోసం ఆయన రాకడ రాకుంటే బాగుంటుందని మనం కోరుకుంటున్నామా? ఈ ప్రశ్నే ప్రామాణికమైన విశ్వాసాన్ని తెలియజేస్తుంది.
“మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు” (1 కొరింథీ 1:7) అని కొరింథీయుల విషయమై చెప్పబడినట్లుగా మనం కొరింథీయులవలె, అలాగే, “మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము” (ఫిలిప్పీ 3:20) అని ఫిలిప్పీయుల విషయమై చెప్పబడినట్లుగా మనం ఫిలిప్పీయులవలె ఉందాం.
అదే మనకున్న సమస్య. ఆయన రాకడను (ప్రత్యక్షతను) మనం ప్రేమిస్తున్నామా? లేక మనకున్న ప్రణాళికలు చెరపకుండా ఆయన రాకడ రాకపోతే బాగుండునని ఈ లోకాన్ని ప్రేమిస్తున్నామా? ఈ ప్రశ్న మీదనే నిత్యత్వం ఆధారపడి ఉంది.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web