వీటన్నిటికి క్రీస్తు యోగ్యుడా?

వీటన్నిటికి క్రీస్తు యోగ్యుడా?

షేర్ చెయ్యండి:

“ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపనియెడల వాడు నా శిష్యుడు కానేరడు….” (లూకా 14:26-27) 

క్రైస్తవునిగా ఉండటమంటే ఎంతో త్యాగపూరితమైన జీవితమని చెప్పడానికి, కుటుంబాన్ని ద్వేషించడం (26వ వచనం), సిలువను మోసికోవడం (27వ వచనం), కలిగినదంతయు విడిచిపెట్టడం (33వ వచనం) అనేటువంటి “అనానుకూలమైన” విషయాలను యేసు మనకు అరమరికలు లేకుండా నిర్భయంగా చెప్పాడు. కృపా నిబంధనలో కనిపించి కనబడకుండా ఉండే అతి చిన్న అక్షరాల ముద్రణ అంటూ ఏమీ ఉండదు. ప్రతిదీ పెద్దదిగాను, బాగా ఎత్తి చూపించే అక్షరాల ముద్రణే (ప్రింటే) ఉంటుంది. చౌకబారు కృప అనేది ఉండనే ఉండదు! ఇది చాలా ఖరీదైన కృప! రండి, నా శిష్యులుగా ఉండండి.

అయితే, సాతాను తన చెడ్డ గుణమంత దాచి, తను చూపగలిగిన ఉత్తమమైనవాటిని మాత్రమే చూపిస్తాడు. సాతానుతో చేసే వ్యవహారమంతా వెనుక పేజీలో కనిపించి కనబడకుండా ఉండే అతి చిన్న అక్షరాల ముద్రణలా (ప్రింటులా) ఉంటుంది.

ముందు పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో, “మీరు చావనే చావరు” (ఆది 3:4), “నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదను” (మత్తయి 4:9) అని ముద్రించబడి ఉంటుంది. అయితే, వెనుక పేజిలో, “క్షణికమైన సుఖాలను అనుభవించిన తరువాత, నువ్వు నాతోపాటు ఎప్పటికీ నరకం అనుభవిస్తావు” అని చిన్న చిన్న అక్షరాలతో, అంటే బైబిల్ అనే భూతద్దంలో చూస్తేగాని చదవడానికి కనబడనటువంటి అక్షరాలతో ముద్రించబడి ఉంటుంది.

సాతాను ఉత్తమమైన దానిని మాత్రమే చూపిస్తున్నప్పుడు, యేసు తన “కఠిన స్థితిని” తెలుపూతూనే తన అత్యుత్తమ స్థితిని చూపించడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడు? దీనికి మాథ్యూ హెన్రీ గారు ఇలా జవాబిచ్చారు, “సాతాను ఉత్తమమైనదాన్ని చూపిస్తాడు, కానీ చెడును దాచిపెడతాడు, ఎందుకంటే అతని ఉత్తమ సంకల్పమంతా అతను చేసే చెడుకు బ్యాలన్స్ చేయదు; కాని క్రీస్తుకు సంబంధించినదంతా సమృద్ధికరమైన ఉత్తమ స్థితిని కలిగిస్తుంది.”

యేసు యొక్క పిలుపు కేవలం ఉపేక్షించుకోవడానికి మరియు శ్రమలు వహించడానికి మాత్రమే పిలుపు కాదు; ఇది మొట్టమొదటిగా విందుకు ఆహ్వానించే పిలుపు. ఇదే విషయం లూకా 14:16-24 వచనాలలోని ఉపమానంలో ఉంది. ఈ జీవితంలో పోగుట్టుకున్న ప్రతిదానికి తిరిగి చెల్లించడానికి యేసు మహిమగల పునరుత్థానాన్ని కూడా వాగ్దానం చేస్తున్నాడు (లూకా 14:14). క్లిష్ట పరిస్థితులను సహించుకునేందుకు ఆయన సహాయం చేస్తానని కూడా మనకు చెప్తున్నాడు (లూకా 22:32). మన తండ్రి పరిశుద్దాత్ముని అనుగ్రహిస్తాడని కూడా ఆయన మనకు చెప్తున్నాడు (లూకా 11:13). మనం ఆయన రాజ్యం కోసం చంపబడినప్పటికీ, “మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు” అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు (లూకా 21:18).

యేసును వెంబడించడానికి చెల్లించే వెలను లెక్క వేసుకోవడానికి మనం కూర్చున్నప్పుడు, “మంచి” “చెడులను” మనం తూకం వేసినప్పుడు, ఆయన వాటికి యోగ్యుడు. ఖచ్చితంగా ఆయన వాటికి యోగ్యుడు (రోమా 8:18; 2 కొరింథీ 4:17).

వీటికి సాతాను యోగ్యుడు కాదు. మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును (సామెతలు 20:17).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...