“సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు”. (మత్తయి 5:5) 

మనం దేవునిలో నమ్మకాన్ని పెట్టినప్పుడే సాత్వికం ఆరంభమవుతుంది. ఆ తర్వాత, మనం ఆయనను నమ్ముతున్నందున మన మార్గాన్ని ఆయనకు అప్పగించుకొంటాం. మన కలవరాలను, చికాకులను, ప్రణాళికలను, సంబంధాలను, ఉద్యోగాలను, ఆరోగ్యాన్ని ఆయనకు అప్పగిస్తాం.

ఆ తర్వాత, మనం సహనంతో ప్రభువు కోసం వేచి ఉంటాం. మన మంచి కోసం, ఆయన మహిమ కోసం ఉత్తమ విధానంలో కార్యములు జరగాలని మనం ఆయన సమయాన్ని, ఆయన శక్తిని, ఆయన కృపను నమ్ముతాం.

దేవుణ్ణి నమ్మి, మన చింతలను దేవునిపై వేయడం, ఆయన కోసం సహనంతో ఎదురుచూడటంవల్ల కలిగే ఫలితం ఏంటంటే మనం తొందరపడకుండా, చిరాకుగా కోపానికి లోనవకుండా ఉంటాం. అంతేగాకుండా, దేవుడే మన పరిస్థితుల మధ్యలో కార్యం జరిగించాలని, ఆయకిష్టమైతే ఆయనే మనకు విడుదలనివ్వాలని మనం సమస్తాన్ని దేవునికే అప్పగిస్తాం.

ఆ తర్వాత, యాకోబు చెప్పినట్లు, “వినుటకు వేగిరపడతాము, మాటలాడుటకు నిదానిస్తాము, కోపించుటకు నిదానిస్తాము” (యాకోబు 1:19). సహేతుకంగాను, దిద్దుబాటుకు సిద్ధంగాను మనం ఉంటాం (యాకోబు 3:17). దీనినే “జ్ఞానముతో కూడిన సాత్వికము” (యాకోబు 3:13) అని యాకోబు పిలుస్తున్నాడు.

సాత్వికం అనేది నేర్చుకోవడానికి ఇష్టపడుతుంది. దిద్దుబాటు కోసం ఒక స్నేహితుడు గాయములు చేసినప్పుడు దానిని విలువైనదిగా ఎంచుతుంది (సామెత 27:6). పాపములోనో లేక తప్పులోనో చిక్కుకున్న ఒక వ్యక్తికి ఒక క్లిష్టమైన మాటను చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, అది తాను చేసిన తప్పును పాపమును ఒప్పుకున్న లోతైన స్థితి నుండి మాట్లాడుతుంది మరియు అది దేవుని కృప మీదనే ఆధారపడుతుంది (గలతీ 6:1).

సాత్వికం యొక్క నిశ్శబ్దత, యథార్థత మరియు బలహీనత అనేది చాలా అందంగాను మరియు చాలా బాధగాను ఉంటుంది. ఇది మన పాప స్వభావమంతటికి విరుద్ధంగా వెళ్తుంది. దీనికి అతీంద్రియ సహాయం అవసరం.

మీరు యేసు క్రీస్తు శిష్యులైనట్లయితే, అంటే మీరు ఆయనను నమ్మి, మీ మార్గాన్ని ఆయనకు ఒప్పజెప్పి, ఆయన కోసం సహనంతో ఎదురుచూసేవారైనట్లయితే, మీకు సహాయం చేయడానికి దేవుడు ఇప్పటికే ఆరంభించాడు, ఆయన మీకు ఇంకా ఎక్కువగా సహాయం చేస్తాడు.

ఆయన మీకు సహాయం చేసే ప్రాథమిక విధానం ఏంటంటే మీరు క్రీస్తు తోటి వారసులని, లోకం మరియు లోకములోని సమస్తం మీదేనని మీ హృదయానికి నియశ్చయతను కలిగించడమే (1 కొరింథీ 3:21-23). సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారు. 

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *