“యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు”. (కీర్తన 34:8)
దేవుని మహిమను మీరు ఎన్నడూ రుచి చూడలేదని చెప్పే మీకు, మీరు దానికి సంబంధించి ఆకలి పుట్టించే అనేకమైన పదార్థాలను రుచి చూశారని నేను చెప్తున్నాను.
మీరెప్పుడైనా ఆకాశం వైపు తల ఎత్తి చూశారా? మీరు ఎప్పుడైనా కౌగలించబడ్డారా? మీరెప్పుడైనా వెచ్చదనాన్ని కలిగించే అగ్ని ముందు కూర్చున్నారా? మీరెప్పుడైనా అడివిలో నడిచారా, చెరువు ప్రక్కన కూర్చున్నారా, వేసవి త్రాళ్ళ ఉయ్యాలలో పడుకున్నారా? మీరెప్పుడైనా వేడిగా ఉన్న రోజున మీకిష్టమైన దానిని త్రాగారా లేక మీకిష్టమైన ఆహారాన్ని తిన్నారా?
ప్రతి కోరిక పరలోక మహిమకు సంబంధించిన దైవభక్తి కలిగినదైనా లేక పరలోక మహిమను తీసుకురాని వికృతమైన ప్రలోభంగానైనా ఉంటుంది.
మీరు దేవుని మహిమను రుచి చూడలేదని మీరు చెబుతారు. మీరు ఆకలి కలిగించే పదార్థాలను రుచి చూశారని నేను చెప్తున్నాను. భోజనానికి వెళ్ళండి. దేవుని దగ్గరకే వెళ్ళండి.
మీరు నీడలను చూశారు; పదార్థాన్ని చూడండి. మీరు పగటి వెచ్చని కిరణాల మధ్యన నడిచారు; మీరిప్పుడు తిరిగి నేరుగా సూర్యున్నే చూడండి, సువార్త అనే సురక్షితమైన మరియు పదునైన అద్దాల ద్వారా తప్పక చూడండి. మీరు ప్రతి చోట దేవుని మహిమ అనే ప్రతిధ్వనులను విన్నారు; ఇప్పుడు నిజమైన సంగీతాన్ని వినడానికి మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి.
మీ హృదయాన్ని సిద్ధం చేసుకునే ఉత్తమ స్థలం ఏదైనా ఉందంటే అది యేసు క్రీస్తు సిలువే. “ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి” (యోహాను 1:14).
మీరు అత్యంత కేంద్రీకృతమైన దేవుని మహిమను చూడాలనుకుంటే, సువార్తలలోని యేసును చూడండి మరియు ముఖ్యంగా సిలువను చూడండి. ఇలా చేయడం ద్వారా మీ కళ్ళను కేంద్రీకరించేలా చేస్తుంది, మీ హృదయాన్ని సిద్ధం చేస్తుంది మరియు మీకున్న రుచిని ఆస్వాదించే మొగ్గలను మేల్కొలుపుతుంది, తద్వారా మీరు ప్రతిచోట దేవుని నిజమైన మహిమను చూస్తారు, ఆ మహిమ గురించి వింటారు మరియు ఆ మహిమను రుచి చూస్తారు.
అందు కోసమే మీరు సృష్టించబడ్డారు. నీడల్లోనికి మీ జీవితాన్ని పారవేయవద్దని మీయందు నేను బ్రతిమాలుచున్నాను. దేవుడు తన మహిమను మీరు చూడాలని, ఆస్వాదించాలని ఆయన మిమ్మల్ని చేశాడు. అన్నిటికంటే మిన్నగా, మీ పూర్ణ హృదయంతో దానిని కొనసాగించండి. ఆకలిని పుట్టించే పదార్థాలను మీరు రుచి చూశారు. ఇప్పుడు మీరు పూర్తి విందు కోసం వెళ్ళండి.