ప్రమాదకరమైన ఉద్దేశం
“ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగములవరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్”. (రోమా 11:35-36)
విధేయత విషయానికి వచ్చినప్పుడు, కృతజ్ఞత అనేది ప్రమాదకరమైన ఉద్దేశం. ఇది ఋణపడి ఉన్నవారి మాటలలో వ్యక్తం చేయబడుతుంటుంది. ఉదాహరణకు, “దేవుడు మీ కోస౦ ఎ౦త చేశాడో చూడ౦డి. కృతజ్ఞతతో నువ్వు అతని కోసం ఎంతో చేయాలి కదా?” లేదా “మీరు ఏమైయున్నారో మీరు ఏమి కలిగియున్నారో అనే వాటన్నిటికీ మీరు దేవునికి రుణపడి ఉన్నారు. అందుకు ప్రతిఫలంగా మీరేం చేశారు?”
ఇటువంటి ఉద్దేశానికి సంబంధించి నేను కనీసం మూడు సమస్యలను కలిగియున్నాను.
మొదటిది, దేవుడు మనకిచ్చిన కృపలన్నిటి కోసం మనం ఆయన ఋణం తీర్చుకోవడం అనేది అసాధ్యం. ఆయనకు తిరిగి చెల్లించడమనేది మనం కనీసం ఆరంభించలేం కూడా. ఎందుకంటే, రోమా 11:35-36 వచనాలు ఇలా చెప్తున్నాయి “ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొందగలవాడెవడు? (జవాబు: ఎవరూ లేరు) ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగములవరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.” మనమెందుకు ఆయనకు తిరిగి చెల్లించలేమంటే మనం ఆయనకు ఇవాల్సినవన్నిటితోపాటు మన ప్రయాస కూడా ఆయనకు చెందినవే.
రెండవది, ఒకవేళ ఆయన మనకిచ్చిన కృపలన్నిటి కోసం ఆయనకు తిరిగి చెల్లించడంలో సఫలమైతే, కృపను ఒక వ్యాపార లావాదేవీగా మార్చడంలో మాత్రమే మనం సఫలీకృతలమవుతాం. మనమొకవేళ ఆయనకు తిరిగి చెల్లించినట్లయితే, అప్పుడు దానిని కృప అని అనరు. ఎవరైనా మిమ్మల్ని డిన్నర్ కు పిలవడం ద్వారా మీ మీద ఒక ప్రత్యేకమైన ప్రేమను చూపించాలని ప్రయత్నిస్తే, వారు చేసిన దానికి మరొక సాయంత్రం వారిని పిలిచి వారికి చెల్లించాల్సింది చెల్లిస్తానని చెపితే, మీరు వారు చూపిన కృపను నిరర్థకం చేసి, దానిని ఒక వ్యాపారంగా మార్చిన వారవుతారు. దేవుడు తన కృప నిరర్థకం కావడానికి ఇష్టపడడు. ఆయన కృప మహిమ పొందాలని దేవుడు కోరుకుంటాడు (ఎఫెసీ 1:6, 12, 14).
మూడవదిగా, విధేయత చూపడం కోసం కృతజ్ఞతపై దృష్టి సారిస్తే దేవుని భవిష్యత్తు కృపని విశ్వసించడం అనే కీలకమైన ప్రాముఖ్యతను నిర్లక్ష్యం చేయడమే. కృతజ్ఞత అనేది గతంలో పొందుకున్న కృపను చూచి, దాని కోసం కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తుంది. విశ్వాసం అనేది భవిష్యత్తుకోసం వాగ్దానం చేయబడిన కృప కోసం ఎదురుచూస్తుంది, అంటే ఇప్పటి నుండి ఐదు నిమిషాల కోసమైనా లేక ఇప్పటి నుండి ఐదు శతాబ్ధాల కోసమైనా భవిష్యత్తుకోసం వాగ్దానం చేయబడిన కృప కోసం నిరీక్షణ కలిగి ఉంటుంది. “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది” (హెబ్రీ 11:1).
భవిష్యత్ కృపపై ఉంచిన ఈ విశ్వాసమే కృపా పూర్వకమైన మానవ విధేయతని భద్రపరిచడానికి ఉన్న ఉద్దేశం. విధేయత అనేది దేవునికి తిరిగి చెల్లించడంలోను, తద్వారా కృపను వ్యాపారంగా మార్చడంలోను ఉండదు. విధేయత అనేది మరి ఎక్కువ కృప కోసం, అంటే భవిష్యత్ కృప కోసం దేవునిపై నమ్మకం ఉంచడం ద్వారా వస్తుంది. తద్వారా ఇది దేవుని ప్రేమ మరియు దేవుని శక్తి అనే అనంతమైన వనరులను గొప్ప చేస్తుంది. విశ్వాసం అనేది, “… నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును” (యెహోషువ 1:9) అనే వాగ్దానంపై దృష్టి పెట్టి, విధేయతతో దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి సాహసిస్తుంది.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web