తీర్పు గురించిన పుస్తకాలు

తీర్పు గురించిన పుస్తకాలు

షేర్ చెయ్యండి:

భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. (ప్రకటన 13:8)

జీవగ్రంథములో వ్రాయబడిన వారందరికీ రక్షణ లభిస్తుంది.

జీవగ్రంథములో వ్రాయబడిన కారణంగా మన రక్షణ సురక్షితము అని చెప్పటానికి గల కారణం ఆ గ్రంధము “వధింపబడిన గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథం” అని పిలువబడటమే. ఈ గ్రంథములోని పేర్లు వారి మంచి పనుల ఆధారంగా వ్రాసినవి కాదు. క్రీస్తు మరణము ఆధారంగా వారు రక్షింపబడ్డారు.

కానీ యోహాను, ప్రకటనగ్రంథం 20:12లో ఇలా చెప్పాడు, “మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.” కాబట్టి, క్రీస్తు మరణము ఆధారంగా మనం రక్షింపబడినట్లయితే, “పుస్తకాల”లో ఉన్న మన జీవితాల రికార్డు మన తీర్పులో ఎటువంటి పాత్ర పోషిస్తుంది?

సమాధానం ఏమిటంటే, మన పనులను నమోదు చేసే పుస్తకాలు, మన విశ్వాసానికి, క్రీస్తుతో మన ఐక్యతకు బహిరంగ నిర్ధారణగా పనిచేస్తాయి మరియు మనం క్రీస్తుకు చెందినవారమని చెప్పడానికి తగిన సాక్ష్యాలను కలిగి ఉంటాయి.

ప్రకటన 21:27ని పరిశీలించండి: “గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయబడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.” వారి పేర్లు “జీవగ్రంథమందు” వ్రాయబడిన ఫలితంగా వారు నశింపరు, అంతమాత్రమే కాదు, వారు అసహ్యమైన, పాపసంబందమైన వాటిని అనుసరించరు.

ఉదాహరణకు, సిలువపై ఉన్న దొంగను పరిశీలించండి. ఆ దొంగ పరదైసులో ప్రవేశిస్తాడని యేసు చెప్పాడు (లూకా 23:43). కానీ పుస్తకాలు తెరిచినప్పుడు అతనికి తీర్పు ఎలా ఉంటుంది? 99.9% కంటే ఎక్కువ అతని జీవితంలో పాపమే ఉంది.

క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే అతనికి రక్షణదొరుకుతుంది.వధింపబడిన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో అతని పేరు ఉంటుంది.

అప్పుడు దేవుడు పుస్తకాలు తెరుస్తాడు. మొదటిగా, ఆయన తన కుమారుని అత్యున్నత త్యాగాన్ని మహిమపరచడానికి ఆ దొంగ యొక్క జీవితకాల పాపపు రికార్డులను తెరుస్తాడు. మరియు, రెండవది, అతని జీవితంలో జరిగిన నాటకీయ మార్పుకు సంబంధించిన ఆ చివరి పేజీని దేవుడు చదువుతాడు. అతని జీవితంలో జరిగిన ఈ దేవుని కార్యం, ఆ పుస్తకాలలో నమోదు చేయబడింది. అది అతని విశ్వాసమునకు మరియు క్రీస్తుతో తనకున్న ఐక్యతకు బహిరంగ నిర్ధారణ అవుతుంది. అతను చేసిన మంచి పనులుకాదు గాని క్రీస్తే అతని మోక్షానికి ఆధారం.

అందువల్ల, పుస్తకాలలో వ్రాయబడినవి మన విశ్వాసానికి మరియు క్రీస్తుతో మన ఐక్యతకు బహిరంగ ధృవీకరణలు  అని నేను చెప్పినప్పుడు, రికార్డులో చెడు పనుల కంటే ఎక్కువ మంచి పనులు ఉంటాయని నా ఉద్దేశ్యం కాదు.

విశ్వాసం యొక్క వాస్తవికతను (క్రీస్తులోతిరిగి జన్మించడం మరియు క్రీస్తుతో ఐక్య పరచబడటం అనే వాస్తవాలను  చూపించే క్రీస్తులోని జీవితం) అక్కడ నమోదు చేయబడుతుందని నా ఉద్దేశ్యం. మనము క్రైస్తవునిగా ఈ విధంగా ప్రతి దినమును ఆరంబిస్తాము: మన శిక్ష గతానికి చెందినది (రోమా8:1), మన పేరు జీవగ్రంథంలో ఉంది మరియు మనలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని ధృడమైననమ్మకం. 

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...