సువార్త సారాంశం యొక్క ఆరు అంశాలు

షేర్ చెయ్యండి:

“ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.”(1 పేతురు. 3:18)

మీరు సువార్తను అర్థం చేసుకొని, దానిలో ఆనందించి, దానిని ఇతరులతో పంచుకోవడానికి సహాయపడేందుకు సువార్త సారాంశాన్ని ఆరు అంశాలలో చెప్పడం జరిగింది.

1) దేవుడు తన మహిమ కోసం మనల్ని సృష్టించుకున్నాడు.

“… దూరమునుండి నా కుమారులనుభూదిగంతములనుండి నా కుమార్తెలను తెప్పించుము.నా మహిమ నిమిత్తము నేను సృజించినవారినినా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుమునేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే” (యెషయా 43:6-7). దేవుడు తన స్వరూపములో మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి మనం ఆయన స్వరూపాన్ని చూపించాలి, లేక ప్రతిబింబించాలి, ఆయన గుణగణాలను మరియు నైతిక అందాన్ని చూపించాలి.

2) అందుచేత మనుష్యులందరు దేవుని మహిమ కోసం జీవించాలి.

“కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి” (1 కొరింథీ 10:31). దేవుని మహిమ కోసం జీవించడమంటే ఆయనను ప్రేమించడం (మత్తయి 22:37). ఆయనను నమ్మడం (రోమా 4:20), ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం (కీర్తన 50:23), ఆయనకు విధేయత చూపడం (మత్తయి 5:16), మరియు అన్నిటికంటే మిన్నగా ఆయనను నిధిగా ఎంచుకోవడం (ఫిలిప్పీ 3:8; మత్తయి 10:37). వీటినన్నిటిని మనం చేసినప్పుడే దేవుని మహిమగల రూపాన్ని చూపగలం.

3) అయినప్పటికీ, మనమందరం పాపం చేసి, దేవుని మహిమను పొందలేకపోతున్నాం.

“ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” (రోమా 3:23). “మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని…… వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి” (రోమా 1:21-23). మనమెవ్వరమూ దేవుణ్ణిప్రేమించవలసినంతగా ప్రేమించలేదు, నమ్మవలసినంతగా ఆయనను నమ్మలేదు, కృతజ్ఞత చెల్లించవలసినంతగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేదు, విధేయత చూపవలసినంతగా విధేయత చూపలేదు, జ్ఞాన నిధిగా ఎంచుకోవలసినంతగా ఆయనను ఎంచుకోలేదు.

4) కాబట్టి, మనమందరం నిత్య శిక్షకు అర్హులం.

“ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము” (రోమా 6:23). యేసు క్రీస్తుకు విధేయత చూపని వారందరు “ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు” (2 థెస్స 1:9). “వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు” (మత్తయి 25: 46).

5) అయినప్పటికీ, దేవుడు తనకున్న గొప్ప కరుణనుబట్టి, పాపులందరికి నిత్య జీవాన్ని ప్రసాదించుట కోసం ఆయన తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించాడు.

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” (యోహాను 3:16). “…క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను” (గలతీ 3:13). “ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను” (1 పేతురు 3:18).

6) అందుచేత, యేసు క్రీస్తును ప్రభువుగాను, రక్షకునిగాను, తమ జీవితాలకు గొప్ప సర్వోత్తమమైన నిధిగాను నమ్మిన ప్రతి ఒక్కరికి నిత్య జీవము ఉచిత బహుమానంగా ఇవ్వబడింది.

“…ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు…” (అపొ. కార్య 16:31).“యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు” (రోమా 10:9). “మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు” (ఎఫెసీ 2:8-9). “నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను” (గలతీ 2:20). “నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేప్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను” (ఫిలిప్పీ 3:8).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...