మీ ఆనందం కోసం యేసు వైపు చూడండి

మీ ఆనందం కోసం యేసు వైపు చూడండి

షేర్ చెయ్యండి:

“మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నియు చేయుదురు … విందులలో అగ్రస్థానములను సమాజమందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.” (మత్తయి 23:5-7)

అందరు మనల్ని గుర్తించాలనే దురద, అందరూ మనల్ని పొగడడం కోసం పరితపిస్తుంది. మన స్వయం-సమృద్దిలో (అనగా మనలో మనమే) మన ఆనందాన్నీ వెతుక్కుంటే, ఇతరులు మనల్ని పట్టించుకోకుండా, పొగడకుండా ఉన్నప్పుడు మనం చాలా అసంతృప్తి చెందుతాం.

అందుకే, “మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నియు చేయుదురు” అని యేసు ప్రభువు మత్తయి 23:5లో శాస్త్రులు, పరిసయ్యులను గురించి వివరించి చెప్తున్నాడు.

స్వయం-సమృద్ది కల్గిన (తనలోనే తన ఆనందాన్ని వెతుక్కునే) గర్వాంధుడైన ఒక వ్యక్తిని ఇతరులు ఎక్కువగా పొగిడితే, ఆ వ్యక్తి పొగడించుకోవలసిన అవసరత నుండి విడుదల చేయబడాలి కదా! “సమృద్ధి” అంటే అదే కదా. కానీ ఆశ్చర్యంగా, స్వయం-సమృద్ధిలో శూన్యత స్పష్టంగా కనుపిస్తోంది!

మన స్వయాన్ని మనమే తృప్తిపరచుకోవడానికి లేక దానిపై ఆధారపడడానికి మనం రూపించబడలేదు. మనం ఎప్పటికీ స్వయం-సమృద్ధిగా ఉండలేం. ఎందుకంటే మనం దేవుడు కాదు. మనం దేవుని స్వరూపంలో ఉన్నాం. మనల్ని దేవుని “వలె” చేసేది మనకున్న స్వయం-సమృద్ధి కాదు. మనం దేవుని నీడగాను మరియు ప్రతిధ్వనులుగాను ఉన్నాం. అందుచేత, స్వంత వనరులతో తృప్తి చెందాలని ఆశపడే అంతరంగంలో ఎల్లప్పుడూ శూన్యత అనేది ఉంటుంది.

ఇతరుల పొగడ్తల కోసం పరితపించే ఈ శూన్యత దేవుని నిరంతర కృపలో విశ్వాసం లేకపోవడాన్ని మరియు మన గర్వాన్ని సూచిస్తుంది. మనుష్యుల మెప్పు కోసం ఉండే దురద భయంకరమైనదని యేసు గమనించాడు. మరియు “అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పును కోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు?…” అని యోహాను 5:44లో ఆయన ప్రశ్నించాడు.

మీరు నమ్మలేరు అనేది దానికి జవాబు. ఇతరుల మెప్పును కోరుకునే దురద, విశ్వాసాన్ని అసాధ్యమైనదిగా మారుస్తుంది. ఎందుకు ఆ విధంగా మారుస్తుంది?

ఎందుకంటే విశ్వాసం, తనపై తాను దృష్టి పెట్టకుండా దేవుని వైపు చూస్తుంది. యేసునందు మీ కోసం దేవుడు సమస్తాన్ని ఇచ్చాడన్న వాస్తవంతో విశ్వాసం సంతృప్తి చెందుతుంది. ఇతరుల పొగడ్తలనే గోకుడు ద్వారా మీ దురదను తృప్తిపరచుకోవాలనుకుంటే, మీరు యేసు నుండి వైదొలగిపోతారు. క్రీస్తు “వలె” ఉండడం అంటే ఇది కాదు. క్రీస్తు తన తండ్రి మహిమ కోసం జీవించాడు. మనం కూడా అలాగే జీవించాలని మనకు పిలుపునిస్తున్నాడు.

అయితే, మన సంతృప్తికి ఆధారం మనమే అయితే, ఆ విషయంలో మనం పశ్చాత్తాపపడినట్లయితే, యేసునందు (విశ్వాసంలో) దేవుడు మన కోసం ఉన్నాడనీ, సమస్తానందం కోసం ఆయన వద్దకు వస్తారు. ఆ తర్వాత, “… నిత్యజీవమునకై ఊరెడి నీటి బుగ్గ” అని యేసు పిలిచిన సంపూర్ణత ద్వారా మనలో ఉన్న శూన్యత అనే దురద భర్తీ చేయబడుతుంది” (యోహాను 4:14).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...