“అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు కృపచొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు, మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణముచేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము”. (2 థెస్స 1:11)
మన మంచి నిర్ణయాలను నెరవేర్చుకోవడానికి దేవుని శక్తిని ఎదురుచూడడం అంటే మనం నిజంగా పరిష్కరించుకోలేమని అర్థం కాదు, లేక మనం నిజంగా స్వచిత్తాన్ని ఉపయోగించమని కాదు.
దేవుని శక్తి ప్రమేయం ఎప్పుడూ మన స్వచిత్తాన్ని ఉపయోగించుకునే స్థానాన్ని తీసుకోలేదు! మనల్ని పవిత్రీకరణ చేయుటలో దేవుని శక్తి ఎప్పటికీ మనల్ని పనిచేయని వారుగా ఉంచదు! మన చిత్తానికి బదులుగా దేవుని శక్తి పనిచేయదు గాని మన చిత్తంలోనే లేక మన చిత్తం వెనకాలే దేవుని శక్తి ఇమిడి ఉంటుంది.
మన జీవితాలలో దేవుని శక్తి అనేది మన చిత్తానికి బదులుగా లేదు గాని మన చిత్తమనే బలములోనూ, మన చిత్తమనే ఆనందంలోనూ ఇమిడి ఉన్నది.
“నేను దేవుని సార్వభౌమాధికారాన్ని నమ్ముతున్నాను, కాబట్టి నేను ఊరకనే కూర్చొని ఉంటాను, ఎటువంటి పని చేయను” అని చెప్పినవారు నిజంగా దేవుని సార్వభౌమాధికారాన్ని నమ్మట్లేదు. మరెందుకని దేవుని సార్వభౌమధికారమును నమ్మేవారు ఉద్దేశపూర్వకంగా ఆయనకు అవిధేయత చూపుతున్నారు?
మీరు ఏమీ చేయకుండా ఊరకనే కూర్చున్నప్పుడు, మీరు ఏమీ చేయడం లేదు. మీరు ఏమీ చేయకుండ ఊరకనే కూర్చొని ఉండాలన్న నిర్ణయంలో మీ స్వచిత్తాన్ని నిమగ్నం చేస్తున్నారు. ఈ విధంగా మీ జీవితంలో ఉండే శోధనతోను లేక పాపముతోను వ్యవహరిస్తున్నట్లయితే, ఇది ఉద్దేశపూర్వకమైన అవిధేయతే, ఎందుకంటే మనం మంచి పోరాటం పోరాడాలని (1 తిమోతి 1:18), అపవాదిని ఎదిరించాలని (యాకోబు 4:7), పరిశుద్ధత కోసం పరితపించాలని (హెబ్రీ 12:14) మరియు శరీర సంబంధమైన పాపపు కార్యాలని చంపాలని (రోమా 8:13) ఆజ్ఞాపించబడ్డాం.
విశ్వాసానికి సంబంధించిన మన మంచి కార్యాలను, మంచి సంకల్పాలను దేవుని శక్తి ద్వారానే మనం నెరవేర్చుతామని రెండవ తెస్సలోనికయులకు 1:11వ వచనం చెప్తోంది. అయితే, దేవుని శక్తి ద్వారా నెరవేర్చుతామన్న విషయం, “సంకల్పం” మరియు “కార్యం” అనే పదాలకున్న అర్థాలను నిరర్థకం చేయడంలేదు. దేవుని పిలుపుకు తగినట్లుగా నడిచే సంపూర్ణ ప్రక్రియలో భాగమై ఉండడం ద్వారా నీతి జరిగించుటకు వ్యవహరించుటలో మన చిత్తం పూర్తిగా నిమగ్నమై ఉంటుంది.
మీ జీవితంలో సమసిపోని పాపాన్ని కలిగి ఉన్నట్లయితే, లేక పోరాటం లేకుండా రక్షించబడటానికి మీరు వేచి ఉన్న కారణాన మీరు కొన్ని మంచి కార్యాలను చేయడం నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే, మీరు మీ అవిధేయతను ఎక్కువ చేసుకొంటున్నారు. మీ స్వచిత్తాన్ని అభ్యసించడం ద్వారా కాకుండా మరేవిధంగాను దేవుడు తన శక్తిని వినియోగించడు; మీరు కలిగియున్న మంచి సంకల్పాల ద్వారానే, అంటే మీరు కలిగియున్న మంచి భావాలు, ఉద్దేశాలు, ప్రణాళికల ద్వారానే దేవుడు తన శక్తిని కనుపరుస్తాడు.
“ఆయన వారిని చూచి–ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను” (లూకా 13:24). మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే (ఫిలిప్పీ 2:13). అందుచేత, దేవుని సార్వభౌమాధికారాన్ని విశ్వసించిన ప్రతి ఒక్కరు పరిశుద్ధత కోసం పోరాటం చేయడానికి తమ స్వచిత్తాలను (ఇష్టాలను) నిమగ్నం చేయడానికి భయపడనక్కర్లేదు.