వాగ్దానాలను ఉపయోగించండి

వాగ్దానాలను ఉపయోగించండి

షేర్ చెయ్యండి:

“హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు”. (మత్తయి 5:8)

“ఆత్మ ద్వారా” శరీర క్రియలను చంపాలని పౌలు చెప్పినప్పుడు (రోమా 8:13), ఆ మాటకు, చంపడానికి ఉపయోగించేటువంటి ఆత్మ కవచంలోని ఒక ఆయుధాన్ని మనం ఉపయోగించాలని నేను అర్థం చేసుకున్నాను; ముఖ్యంగా, “దేవుని వాక్యమనే” (ఎఫెసీ 6:17) ఖడ్గాన్ని ఉపయోగించాలని నేననుకున్నాను.

అందుచేత, ఏదో ఒక శోధన చేతనో, లేక భయం చేతనో పాపం చేయడానికి శరీరం నడిపించబడినప్పుడు, మనం ఆత్మ ఖడ్గాన్ని తీసుకొని, భయాన్ని శోధనను చంపేయాలి. నా వ్యక్తిగత అనుభవంలో ఆ మాటకు అర్థం ఏమిటంటే సర్వోత్తమమైన వాగ్దానపు శక్తి ద్వారా పాపపు వాగ్దానం యొక్క వేరును కూకటివేళ్ళతో వేరు చేయడమే.

ఉదాహరణకు, ఏదైనా లైంగికపరమైన కోర్కెల విషయమై నేను శోధించబడుతున్నప్పుడు, ఈ లైంగికపరమైన సుఖానికి సంబంధించిన ఈ వాగ్దానపు వేరును సమూలంగా తీసివేసే ఆత్మ ఖడ్గం ఏంటంటే “హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు” (మత్తయి 5:8). ఎటువంటి కల్మషంలేని మనస్సాక్షి నుండి దేవుణ్ణి మరింత స్పష్టంగా చూడగలిగిన ఆనందంతో కూడిన అనుభవాలను నేను జ్ఞాపకం చేసుకున్నాను; మరియు పాపం చేయుట ద్వారా లభించే ఆనందాలను అనుభవించిన తర్వాత నేను విసుగుదలను, లోతులేని స్థితిని మరియు క్రూరతను జ్ఞాపకం చేసుకున్నాను, మరియు వాటితో, జయించే పాపపు శక్తిని దేవుడు చంపేశాడు.

శోదించబడే గడియలో మన వద్ద వాగ్దానాలను కలిగియుండడమనేది పాపానికి విరుద్ధంగా చేసే విజయవంతమైన పోరాటానికి ఒక ముఖ్యాంశమై ఉన్నది.

అయితే, మన మనస్సులలో దేవుని నుండి సమయానికి సరిగ్గా సరిపోయిన వాక్యాన్ని కలిగి ఉండని సందర్భాలు ఉన్నాయి. ఆ శోధనకు ప్రత్యేకంగా ఇవ్వబడిన వాగ్దానం కోసం బైబిల్ అంతటిని చూసే సమయం లేదు. అందుచేత, మనల్ని దారి మళ్ళించడానికి భయం లేక శోధన అనేవి ఎదురైనప్పుడల్లా వాగ్దానాలను ఉపయోగించడానికి మన వద్ద ఒక చిన్న సాధారణ వాగ్దానాల ఆయుధశాలను పెట్టుకోవాల్సిన అవసరత ఉంది.

పాపంతో పోరాటం చేస్తున్నప్పుడు నేను తరచుగా ఉపయోగించే నాలుగు వాగ్దానాలు ఈ క్రింద ఉన్నాయి చూడండి:

“భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనలనుండి పిలుచుకొనినవాడా,నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపకయేర్పరచుకొంటిననియునేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నానుభయపడకుము నేను నీ దేవుడనైయున్నానుదిగులుపడకుము నేను నిన్ను బలపరతునునీకు సహాయము చేయువాడను నేనేనీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును”. – యెషయా 41:10

“కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవ సరమును తీర్చును. మన తండ్రియైన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్”. – ఫిలిప్పీ 4:19

“నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేప్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను” అను ఫిలిప్పీ. 3:8లో వాగ్దానం ఉంది.

నిజమే మరి, ఎందుకంటే “హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు” (మత్తయి 5:8)

వాగ్దానాల ఆయుధగారంలో నిరంతరం వాగ్దానాలను చేరుస్తూనే ఉండండి. అయితే, దేవుడు మీ జీవితంలో ఆశీర్వదంగా ఉంచిన కొన్ని వాగ్దానాలను ఎన్నడూ కోల్పోకండి. ఈ రెండిటిని చేయండి. పాతవాటితో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ప్రతి ఉదయం మీతో తీసుకొని వెళ్ళుటకు ఒక క్రొత్త వాగ్దానాన్ని సిద్ధం చేసుకోండి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...