దాతృత్వానికి ఐదు బహుమానాలు

దాతృత్వానికి ఐదు బహుమానాలు

షేర్ చెయ్యండి:

“పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి”. (రోమా 12:13)

మనం దేవుని వాగ్దానాలను విశ్వసించి, ధారాళంగా ఇచ్చి, మన గృహాలను ఒకరికొకరు మరియు అవసరంలో ఉన్నవారి కొరకు తెరిచినట్లయితే, మనకు ఏ బహుమానాలు ఉంటాయి?

1. పరిశుద్ధుల బాధలు పోతాయి లేదా కనీసం తగ్గుతాయి. “పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు” అంటే అర్ధం ఇదే. మనము ఒకరి భారాన్ని భరిస్తున్నాం. మనము వారికున్న ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగజేశాము. మనము నిరీక్షణను ఇస్తున్నాము మరియు అది వారికి ఒక గొప్ప బహుమతి!

2. దేవుని మహిమ ప్రదర్శించబడుతుంది. “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి” (మత్తయి 5:16). ధారాళంగా ఇవ్వడం మరియు గృహాలు తెరవడం ద్వారా మీ జీవితంలో దేవుని మహిమను, మంచితనమును మరియు దేవుని విలువను ఇతరులకు కనబరుస్తున్నాము. దేవుడు మనకు డబ్బు మరియు గృహాలను ఇవ్వడానికి కారణం ఏమిటంటే, మనం వాటిని ఉపయోగించే విధానం ద్వారా అవి మనకు దేవుడు కాదని ప్రజలు గమనించవచ్చు. కానీ దేవుడు మాత్రమే మన దేవుడు. మరియు ఆయనే మన నిధి.

3. దేవునికి మరింత కృతజ్ఞతలు తెలియజేయబడతాయి. “ఈ పరిచర్య ద్వారా జరిగే సేవ పరిశుద్ధుల అవసరాలను తీర్చడమే కాక, దేవునికి అనేక కృతజ్ఞతలు పొంగిపొర్లడానికి సహాయపడుతుంది” (2 కొరింథీ 9:12). దేవుడు మనకు ధనాన్ని మరియు గృహాలను కేవలం మనము కృతజ్ఞతలు చెప్పడానికే కాదు, కానీ మన దాతృత్వం మరియు ఆతిథ్యం ద్వారా చాలా మంది దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇచ్చాడు.

4. దేవుని పట్ల మనకున్న ప్రేమ మరియు మనలో ఆయన ప్రేమ ధృవీకరించబడుతుంది. “ఈ లోకపు జీవనోపాధి గలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?” (1 యోహాను 3:17). మరో మాటలో చెప్పాలంటే, మనం ఉదారంగా ఇచ్చి, మన గృహాలను తెరిచినప్పుడు, దేవుని ప్రేమ మన జీవితాల్లో ధృవీకరించబడుతుంది. మనము నిజమైన విశ్వాసులం. మనము బూటకపు క్రైస్తవులం కాదు.

5. చివరిగా, మనం పరలోకంలో ధనాన్ని పోగు చేస్తాం. “మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి; అక్కడికి దొంగరాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును.” (లూకా 12:33-34)

ధారాళంగా ఇవ్వడం మరియు గృహాలు తెరవడం అనేవి క్రీస్తు కేంద్రీకృత జీవిత విధానానికి దగ్గరగా ఉంటాయి. మన మనీబ్యాగ్‌లు, మన చెక్‌బుక్‌లు, మరియు ఇళ్లను మనం తరచుగా తెరవకపోవడానికి గల కారణాలు భయం మరియు దురాశల బానిసత్వంలో కూరుకుపోవడమే. దీనికి పరిష్కారము క్రీస్తు సన్నిధిలో ఆనందించడం మరియు క్రీస్తు వాగ్దానము యొక్క నిశ్చయతను కలిగి ఉండడం: “కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.” (ఫిలిప్పీ4:19)

మన బహుమానం దేవుని మహిమ కనుపరచబడటం, ఇతరులు మేలుపొందుకోవడం, అందరూ కలిసి క్రీస్తు అను ఐశ్వర్యమును భద్రపరచుకోవడం ద్వారా వచ్చే ఆనందం. కావున “పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వండి” అని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...