మనకు పరిచర్య చేసే యేసు
“మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను”. (మార్కు 10:45)
యేసుక్రీస్తు భూమిపై జీవించినప్పుడు తన ప్రజలకు సేవకుడిగా ఉండడమే కాకుండా, ఆయన మళ్లీ తిరిగి వచ్చినప్పుడు కూడా మనకు సేవకుడుగా వుంటాడు. “అతడు [యేసు] నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (లూకా 12:37). యేసు తిరిగి వచ్చినప్పుడు ఏమి చేస్తాడో ఇక్కడ చెప్పబడింది.
అంతేకాదు ఇప్పుడు కూడా యేసు మన సేవకుడు. “ ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.’ కాబట్టి మనం నమ్మకంగా చెప్పగలం, ‘ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు?’’. (హెబ్రీ 13:5-6)
యేసుక్రీస్తు గతంలో తన ప్రజలకు సేవకుడిగా ఉన్నాడు, ఇప్పుడు ఉంటున్నాడు మరియు ఎప్పటికీ ఉంటాడని చెప్పడం క్రీస్తు పునరుత్థానమును కించపరిచినట్టా?
“సేవకుడు” అంటే “ఆజ్ఞలు తీసుకునేవాడు” అని అర్థం చేసుకున్నట్లయితే, లేదా మనం ఆయన యజమానులమని భావించినట్లయితే అది ఆయనను అగౌరవపరుస్తున్నట్లే, కానీ మనం బలహీనులమని, ఆయన సహాయం అవసరమని చెప్పడం ఆయనను అగౌరవపరచడం కాదు.
మన గొప్ప అవసరాల నిమిత్తమై సేవ చేయగలిగేది యేసుక్రీస్తు మాత్రమే అని చెప్పడం ఆయనను అగౌరవపరచదు.
యేసుక్రీస్తు ప్రేమ తరగని నీటి ఊట. ఆయన మనకు ఎంత ఎక్కువ సహాయం చేస్తే ఆయన సేవపై మనం అంత ఎక్కువగా ఆధారపడతాము. ఆయన దయచేసే వనరులు మనకి అంత అద్భుతంగా కూడా కనిపిస్తాయి. ఇలా చెప్పడం యేసుక్రీస్తుని అగౌరవపరచడం కాదు. కాబట్టి, “మనకు సేవ చేయడానికి యేసుక్రీస్తు సజీవంగా ఉన్నాడు!” అని మనం ఎంతో నిశ్చయంగా చెప్పగలం.
క్రీస్తు రక్షించడానికి సజీవంగా ఉన్నాడు. ఇవ్వడానికి సజీవంగా ఉన్నాడు. మరియు ఆయన ఈ విధంగా ఉన్నందుకు ఆనందిస్తున్నాడు.
మీ చింత ఆయనకు భారం కాదు. మనపై భారం మోపేవాడుగా కాక, మన భారం మోసేవాడుగా ఆయన ఉంటాడు. “తన కొరకు కనిపెట్టువాని విషయమై” పని చేయుటకు ఇష్టపడును (యెషయా 64:4). ఆయన “… తన కృప కొరకు కనిపెట్టు వారియందు యెహోవా ఆనందించువాడై యున్నాడు” (కీర్తన 147:11). “తనయెడల యధార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” (2 దిన 16:9)
తనయందు నమ్మికయుంచు ప్రతి ఒక్కరి నిమిత్తము, యేసుక్రీస్తు సర్వశక్తితో సంతోషముగా సేవించుచున్నాడు.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web