“ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను… మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను”. (2 పేతురు 3:1-2)
ఈస్టర్ సమీపిస్తుండగా, మన జీవితాలకి యేసు పునరుత్థానము ఏమైయుందో దాని పట్ల కృతజ్ఞతను, ఆనందాన్ని, ప్రశంసను మరియు ఆశ్చర్యమును కలిగి ఉండేలా ఒకరిని ఒకరం పురికొల్పుకుందాం. మన పాప స్వభావం యొక్క శాపం ఏమిటంటే, ఒకప్పుడు మనల్ని ఆశ్చర్యం కలిగించే విషయాలు రాను రాను సర్వసాధారణం అయిపోవడమే. వాస్తవికత మారలేదు కాని మనం మారిపోయాం.
అందుకే బైబిలు అందుబాటులో ఉంది. పేతురు తన రెండు పత్రికల ద్వారా మీకు కొన్నింటిని “జ్ఞాపకముచేసి” మీ మనస్సులను “రేపుచున్నాను” లేదా “ఉత్తేజపరుస్తున్నాను” అని చెప్తున్నాడు.
కాబట్టి, జ్ఞాపకము చేయబడడం ద్వారా యదార్ధమైన మన మనస్సులను రేపుకుందాము.
యేసును మృతులలో నుండి లేపడం ద్వారాదేవుడు ఏమి చేసాడు? ఇక్కడ కొన్ని లేఖనానుసారమైన సమాధానాలు ఉన్నాయి.
యేసు యేసు పునరుత్థానం కారణంగా, మనం సజీవమైన నిరీక్షణ కొరకు మనం తిరిగి జన్మించాము.
1 పేతురు 1:3: “మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు… ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.”
యేసు పునరుత్థానం కారణంగా, ఆయనకు ఇప్పుడు గొప్ప మహిమ ఉంది. దానికొరకే మనం సృష్టించబడ్డాము. ఆయనను ఆయనలా చూడడమే మన అంతిమ లక్ష్యము.
1 పేతురు 1:20 “తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల…”
యోహాను 17:5, 24“తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము… తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి.”
ఆరాధన, విధేయత మరియు సంతోషం విషయాలలో లోతైన అనుభవం కొరకు పునరుత్థానుడైన ప్రభువైన యేసే స్వయంగా మీ మనస్సును మేలుకొల్పి ఉత్తేజపరుచును గాక.