“ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.”
(హెబ్రీ 10:14)

మనలాంటి అపరిపూర్ణమైన పాపులందరికి ఈ వచనం ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది, అలాగే పరిశుద్ధత కలిగి జీవించడానికి ఎంతగానో ప్రేరేపిస్తుంది. అంటే, మీరిప్పుడు పరిపూర్ణులైనందువలన మీ పరలోకపు తండ్రి దృష్టిలో మీరు పరిపూర్ణులుగాను, సంపూర్ణులుగాను నిలుచుటకు నిశ్చయత కలిగియున్నారని కాదు. మీరిప్పుడు పరిపూర్ణులుగా లేనప్పటికీ, మీరు “పవిత్రీకరించబడుచున్నారు,” లేదా “పరిశుద్ధపరచబడుచున్నారు”.

కాబట్టి విశ్వాసములో దేవుని వాగ్దానముల ద్వారా మీ అపరిపూర్ణమైన స్థితిలో నుండి అత్యధికమైన పరిశుద్ధతలోనికి వెళ్తున్నారు. దీని గురించే హెబ్రీ 10:14వ వచనం మాట్లాడుతోంది.

మీ విశ్వాసం పాపాన్ని వదిలి, పరిశుద్ధతలో వృద్ధి చెందడానికి ఉత్సాహాన్ని కలిగిస్తోందా? అపరిపూర్ణతలో ఉండే విశ్వాసమే క్రీస్తు వైపు చూచి, “మీరిప్పటికే మీ దృష్టిలో నన్ను పరిపూర్ణునిగా చేశారు” అని చెప్పగలుగుతుంది.

ఇదే విశ్వాసం, “ప్రభువా, ఈ రోజు నేను పాపం చేశాను. అయితే, నేను పాపాన్ని ద్వేషిస్తున్నాను. నా హృదయం మీద మీరు వ్రాసిన ధర్మశాస్త్రమునుబట్టి, నేను దానిని చేయుటకు ఆశ కలిగియున్నాను. మీ దృష్టిలో మీకు ఏది ఇష్టమో దానిని నాలో జరిగిస్తున్నారు (హెబ్రీ 13:21). కాబట్టి నేను ఇప్పటికీ చేస్తున్న పాపాన్ని నేను ద్వేషిస్తున్నాను; నాకు వచ్చే పాప సంబంధమైన ఆలోచనలను కూడా నేను ద్వేషిస్తున్నాను.” 

ఇది రక్షించే నిజమైన మరియు వాస్తవమైన విశ్వాసం. “ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు” అనే మాటలను రుచి చూసేటువంటి విశ్వాసమిది.

ఇది బలవంతులు అతిశయించేది కాదు. ఇది రక్షకుని కోసం బలహీనుల అంగలార్పుయైయున్నది.

ఈ విధంగా క్రీస్తును విశ్వసించేంత బలహీనులుగా ఉండటానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. 

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

One comment

  1. మెసేజ్ చాలా బాగుంది దేవుని కి మహిమ కలుగును గాక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *