అతి చిన్న విశ్వాసం.
“కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని,
కరుణించు దేవునివలననే అగును”. (రోమా 9:16)
యేసునందు విశ్వాసులుగా ఈ సంవత్సరమంతా దేవుని నుండి మనం పొందుకునేదంతా కరుణే అని ఈ సంవత్సర ఆరంభంలోనే మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. మన జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలు ఏవైనా, అవి ఆయన కృపా కనికరములే.
ఇందుచేతనే, క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు: “అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను” (రోమా 15:9). “ఆయన తన విశేష కనికరముచొప్పున” మనలను మరల జన్మింప జేసెను (1 పేతురు 1:3). “మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు” మనం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం (హెబ్రీ 4:16); మనమిప్పుడు “నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచున్నాము” (యూదా 1:21). నమ్మదగిన వ్యక్తి అని ఏ క్రైస్తవుడైనా నిరూపించగలిగితే, ఆయన నమ్మకమైనవాడై యుండుటకు ప్రభువువలన కనికరము పొందాలి” (1 కొరింథీ 7:25).
లూకా 17:5-6 వచనాలలో “మా విశ్వాసమును వృద్ధి పొందించు” అని అపొస్తలులు ప్రభువును వేడుకున్నారు! అప్పుడు యేసు వారితో, “మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచి–నీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును” అని వారితో చెప్పాడు. మరొక విధంగా చెప్పాలంటే, మన క్రైస్తవ జీవితంలోనూ, సేవలోనూ ఉన్న సమస్య మనకున్న విశ్వాస బలం కాదు లేక విశ్వాస పరిమాణo కాదు, ఎందుకంటే మనకున్న విశ్వాసమునుబట్టి కంబళి చెట్టు వేళ్ళతో పెల్లగించబడదు గాని అక్కడ దేవుడే కార్యం చేస్తాడు. అందుచేత, నిజంగా క్రీస్తుతో సంబంధాన్ని కలిపే అతి చిన్న విశ్వాసం మీకు కావలసినంత ఆయన శక్తిని కలుగజేస్తుంది. అయితే, మీరు విజయవంతంగా ప్రభువుకు లోబడే సందర్భాల గురించేమిటి? మీరు కలిగియున్న విధేయత కనికరం కోసం మీరు అభ్యర్థించే స్థితి నుండి బయటకు పంపుతోందా? ఈ ప్రశ్నకు జవాబు లూకా 17:7-10 వచనాలలో యేసు చెప్తున్నాడు.
“దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చినప్పుడు – నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక – నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా? అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత – మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.” లూకా 17:7-10
అందుచేత, సంపూర్ణ విధేయత మరియు అతి చిన్న విశ్వాసము దేవుని నుండి ఒకే విధమైన ఫలితాన్ని, అంటే కనికరాన్ని (కరుణను) పొందుకునే విధంగా చేస్తాయని చెప్పి ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. కేవలం ఒక ఆవగింజంత విశ్వాసం ఒక చెట్టును కదిలించే దేవుని శక్తికి సంబంధించిన కనికరాన్ని తట్టి లేపుతుంది. ఎటువంటి లోపాలు లేనటువంటి విధేయత దేవుడు చూపించే కనికరం మీద ఆధారపడేలా చేస్తుంది.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే, దేవుని కనికరం ఎటువంటి రూపంలో వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, కనికరమునుబట్టి కలిగే ప్రయోజనాల స్థాయికి మించి మనం పైకి ఎదగలేం. మనం పొందుకోవడానికి యోగ్యతలేనివాటి మీద మనం పూర్తిగా ఆధారపడ్డాం.
అందుచేత, మనల్ని మనం తగ్గించుకుందాం, ఆనందపడదాం మరియు “ఆయన కనికరం కోసం దేవుణ్ణి మహిమపరుద్దాం!”
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web