“అందువలన నేను మీతో చెప్పునదేమనగా – ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా?” (మత్తయి 6:25-26)
యేసు చేసిన కొండ మీద ప్రసంగాన్ని మనం మూడు రోజులు చూడబోతున్నాం. మత్తయి 6:25-34 వచనాల వాక్యభాగంలో ముఖ్యంగా ఆహారం, బట్టలు గురించి చేసే చింత విషయమై యేసు చెబుతున్నాడు గాని వాస్తవానికి ఇది సమస్త చింతలను గురించి చెప్పబడిన విషయం.
విస్తృతమైన సంక్షేమ వ్యవస్థ ఉన్న అమెరికాలో కూడా, ఆర్థిక, గృహనిర్మాణం, ఆహారం మరియు దుస్తులను గురించిన ఆందోళన తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎక్కువ పేదరికం ద్వారా జీవితాలకు ముప్పు కలిగించే పరిస్థితులలో నివసిస్తున్న క్రైస్తవుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, మత్తయి 6:30వ వచన౦లో, “అల్ప విశ్వాసులారా” అని యేసు సంబోధించుట ద్వారా మనకున్న చింత లేక ఆందోళన అనేది భవిష్యత్తు కృపకు సంబంధించిన మన తండ్రి వాగ్దానం విషయమై అల్ప విశ్వాసం ఉంచుటం ద్వారా వస్తుందని యేసు చెప్తున్నాడు.
25-34 వచనాల్లో అవిశ్వాసానికి వ్యతిరేకంగా మంచి పోరాటం చేయడానికి మరియు చింత నుండి విముక్తి పొందడానికి సహాయం చేసేందుకు యేసు రూపొందించినవి (డిజైన్ చేసినవి) కనీసం ఏడు వాగ్దానాలు ఉన్నాయి. (ఈ రోజు మనం మొదటి రెండు వాగ్దానాలు చూసి, మిగిలినవి తర్వాత వచ్చే రెండు రోజుల్లో చూద్దాం.)
వాగ్దానం #1: “అందువలన నేను మీతో చెప్పునదేమనగా – ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?” (మత్తయి 6:25)
ఆహారం మరియు దుస్తులకంటే మీ శరీరాన్ని మరియు మీ జీవితాన్ని మీకు అందించడం అతి కష్టం, అయినప్పటికీ దేవుడు ఈ రెండింటినీ సృష్టించి, మీకిచ్చినప్పుడు, ఖచ్చితంగా ఆయన మీకు ఆహారం మరియు దుస్తులను కూడా అందిస్తాడు, అందించడానికి ఇష్టపడతాడు.
అంతేగాకుండా, ఏమి జరిగినా, దేవుడు ఏదో ఒక రోజు మీ శరీరాన్ని లేపుతాడు మరియు తన నిత్య సహవాసం కోసం మీ జీవితాన్ని మరియు శరీరాన్ని భద్రపరుస్తాడు.
వాగ్దానం #2: “ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా?” (మత్తయి 6:26)
తమ ఆహారం విషయంలో ఏమీ చేయలేని పక్షులను ఇష్టపడి పోషించినప్పుడు, మీరు వ్యవసాయం చేసుకొని పోషించుకునేవారికి ఆయన ఖచ్చితంగా మీకు అవసరమైనవాటిని అందిస్తాడు, ఎందుకంటే మీరు పక్షులకంటే చాలా విలువైనవారు. పక్షులవలె కాకుండా, మీరు దేవుని నమ్మడం, విధేయత చూపడం మరియు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా దేవుణ్ణి మహిమపరచగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.



