చింతించకుండ ఉండటానికి 7 కారణాలు – రెండవ భాగం

చింతించకుండ ఉండటానికి 7 కారణాలు – రెండవ భాగం

షేర్ చెయ్యండి:

“మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు అయినను తన సమస్త వైభవముతోకూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా”.  (మత్తయి 6:27-30)

మత్తయి 6:25-34 వచనాల్లో అవిశ్వాసానికి వ్యతిరేకంగా మంచి పోరాటం చేయడానికి మరియు చింత నుండి విముక్తి పొందడానికి సహాయం చేసేందుకు యేసు రూపొందించినవి (డిజైన్ చేసినవి) కనీసం ఏడు వాగ్దానాలు ఉన్నాయి. నిన్నటి రోజున మనం మొదటి రెండు వాగ్దానాలను చూసుకున్నాం; ఈ రోజు మనం 3 మరియు 4 వాగ్దానాలను చూద్దాం.

వాగ్దానం #3: “మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?”  (మత్తయి 6:27)

వాస్తవానికి మీరు మీ స్వంత అనుభవము నుండి తెలుసుకోదగిన సాధారణ వాగ్దానమిది: చింతించడం వలన మీకు ఎటువంటి మేలు కలుగదు. ఇదే వాగ్దానం. ఇది ప్రధానమైన వాదన కాదు గాని కొన్నిసార్లు మనతో మనం కఠినంగా ఉండి, “నా ప్రాణమా, చింతించడంవలన ఎటువంటి ప్రయోజనం లేదు. అది మీకు ఎటువంటి వాగ్దానం చేయదు. నువ్వు రోజంతా ఆందోళన చెందడమే కాకుండా, ఇతరులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నావు. చింతించడం మాను. దాన్ని దేవునికి వదిలిపెట్టు. నీ పనిలో నీవు నిమగ్నమైయుండు” అని  చెప్పాలి.

చింతించడంవలన ఎటువంటి ప్రయోజనం లేదు. ఇదే వాగ్దానం. దీనిని నమ్మండి. దీనినిబట్టి నడుచుకోండి.

వాగ్దానం #4: “వస్త్రములనుగూర్చి మీరు చింతింప నేల? అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు అయినను తన సమస్త వైభవముతోకూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.” (మత్తయి 6:28-30)

అడవి పువ్వులతో పోలిస్తే దేవునికి మీరెంతో ప్రాముఖ్యమైనవారు, ఎందుకంటే మీరు ఎప్పటికీ జీవిస్తారు, తద్వారా ఆయన ప్రియమైన పిల్లలుగా ఆయనకు శాశ్వత మహిమను తీసుకువస్తారు.

ఏదేమైనా, దేవుడు ఎంతగా సృజనాత్మక శక్తిని, శ్రద్ధను కలిగియున్నాడంటే ఆయన దానిని కొన్ని రోజులు మాత్రమే ఉండే పువ్వులపై అమితంగా చూపించాడు. అయితే, ఆయన ఖచ్చితంగా అదే శక్తిని మరియు అదే సృజనాత్మక నైపుణ్యాన్ని శాశ్వతంగా జీవించే తన పిల్లల సంరక్షణ కోసం ఉపయోగిస్తాడు. మనం ఈ వాగ్దానాన్ని నమ్మి, చింతను దూరం చేయగలుగుతామా? అన్నదే మనముందున్న ప్రశ్న.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...